చెన్నయ్‌లో నాకు ఇంకోపేరుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లైకా ప్రొడక్షన్స్ పతాకంపై జి.వి.ప్రకాష్‌కుమార్ కథానాయకుడుగా శ్యామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నాకు ఇంకోపేరుంది’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోంది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు ప్రకాష్‌కుమార్ మాట్లాడుతూ, చెన్నయ్‌లో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించామని, యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రం తాము అనుకున్నదానికన్నా బాగా వచ్చిందని తెలిపారు. ఈ సినిమాకు పెట్టిన పేరుకు యువతలో మంచి స్పందన లభిస్తోందని, త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. పాటలు హైలెట్‌గా సాగే ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రూపుదిద్దుతున్నామని అన్నారు. ఆనంది కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, కెమెరా: కృష్ణన్ వసంత్, ఎడిటింగ్: రూబెన్, కథ, దర్శకత్వం: శ్యామ్ ఆంటోన్. (చిత్రం) జి.వి.ప్రకాష్‌కుమార్, ఆనంది