మహానటి సావిత్రి చారిత్రకాంశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ‘మహానటి’ పేరుతో ఒక చలనచిత్రం విడుదలై బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. అందుకుగల కారణాలను సినీ పరిశ్రమలోని పెద్దలు విశే్లషిస్తున్నారు. మెగాస్టార్లు లేకుండా ఒక సాదాసీదా బయోపిక్ అంతర్జాతీయ స్థాయిలో ఇంత డబ్బు ఎలా వసూలు చేసింది? అని సినీ పండితులు ఆశ్చర్యపడుతున్నారు. ఐతే ఇందులో కథానాయిక పేరు సావిత్రి. ఆమెను ఈ తరంవారు ఎరుగరు. కాంచనమాల, మీనాకుమారి, సావిత్రి వీరు లెజెండరీస్. వీరి జీవితాలు సినిమాగా తీయడానికి తగినంత ఇతివృత్తం ఉంది. ఇక సినిమాలోని మంచి చెడ్డలను ఎందరో చర్చించారు. అభినందనల వర్షం కురిపించారు. నాది చారిత్రక దృష్టి. కాబట్టి రెండు మూడు అంశాలు పాఠకుల దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను.
1. కథాకాలం 1950. అప్పటికి నయాపైసలు రాలేదు. తొలిసారి 1956లో అణా - బేడలు పోయి పది పైసల నాణెం వచ్చింది.
2. పింగళి నాగేంద్రరావు వంటి వ్యక్తులను ఈ తరంవారు చూచి ఎరుగరు. ఈ సినిమాలో ఆయా సజీవ పాత్రలను చిత్రించారు. సంతోషం. ఐతే వారిలో కొందరికి ఆయా వ్యక్తుల పోలికలు లేవు.
3. మద్దాళి సుశీల నా మిత్రురాలు. విజయవాడలో ఉంది. నేను ‘ఆరదగాయ’ నాటిక వ్రాసినపుడు ఆమెను సంప్రదించాను. సినిమాలో సుశీలను వాడుకొని ఉండవలసింది.
4. ఇందులో బెంగుళూరులో బేబీ శేషు ప్రసక్తి లేదు.
5. గురవయ్య కాపు కులస్థుడు. కొమ్మురెడ్డి వెంకట్రామయ్య చౌదరి ట్రక్ డ్రైవర్. ఇతర వివరాలు పల్లవి రచించిన సావిత్రిలో చూడండి.
6. ఇందులో కొంగర జగ్గయ్యకు ఎట్టి ప్రాధాన్యం లేదు. విజయవాడ నాట్యమండలిలో వారంతా కలిసి పనిచేశారు.
7. ఈ మధురవాణి ఎవరు? చర్చిలో పెళ్లి ఏమిటి? ప్రధాన కథకు ఈ ఉపకథకు ఎట్టి సంబంధం లేదు.
8. సావిత్రి సోదరి మారుతి. ఆమె పాత్రకు ఇందులో ప్రవేశం లేకుండా పోయింది.
9. సావిత్రి పెళ్లి జరిగింది ఒక గుడిలో.
10. ఆమె చివరిదశలో హెరిటేజ్ కూరగాయల షాపు నడిపిందని మిత్రులు చెప్పారు. ఈ అంశం నిర్థారించుకోవాలి.
11. సావిత్రి తన సంతకంలో సావి3 అని మూడు అంకె వేసేది.
12. ఆమెకు ఎడమచేతి వాటం ఎక్కువ. ఎడమ పిడికిలి బిగించి పనికి ఉపక్రమించటం ఆమె మేనరిజం.
13. సావిత్రి అనగానే అహనా పెళ్లంట అనే మాయా శశిరేఖయేనా? నవరాత్రి, చివరకు మిగిలేది వంటి చిత్రాల్లో గొప్ప సాత్వికాభినయం ప్రదర్శించింది.
14. ‘మహానటి సావిత్రి గణేశన్ ఇట్లు చెప్పుచున్నది- లక్స్ సబ్బు నా సౌందర్య రహస్యం’ అని 1956లో ఆంధ్రపత్రికలో ఒక ప్రకటన వచ్చింది. దానివల్ల ఆమె జెమినీ గణేశ్‌ను వివాహం చేసుకున్న సంగతి మొదటిసారి ప్రజలకు తెలిసింది.
15. శరీర వర్ణం నల్ల నేరేడు పండులా ఉండేది.
16. ఆమె బాల్యంలో మంజులూరి కృష్ణారావు ఆశీర్వాదం పొందింది.
17. ఆమె వలె స్టార్ కావాలని విజయవాడ నుండి మద్రాసు రైలు ఎక్కిన చాలామందిని టిక్కెట్టు డబ్బు ఇచ్చి సురక్షితంగా ఇంటికి చేర్చింది.
18. ఆమెకు ఒక దశలో ముక్కోపం రావటం మొదలయింది.
19. సావిత్రి చివరిదశలో ఒక అగ్రనటుడు ఆమెకు సహాయం చేయలేదు సరికదా కనీసం చూడడానికి కూడా రాలేదు.
20. సావిత్రిని గురించి రావూరి భరద్వాజ వంటివారు మద్రాసులో చాలా సమాచారం సేకరించారు.
ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ‘ఇద్దరు భార్యలున్న గణేశ్‌ను ఎందుకు పెళ్లిచేసుకున్నారు?’ అని పత్రికా విలేఖరులు ప్రశ్నిస్తే ‘గణేశునికి సిద్ధి బుద్ధి అని ఇద్దరు భార్యలున్నారు కదా’ అని ఆమె పౌరాణికాంశం ఉదాహరించింది.
ఈ చిత్రంలో ఫృథ్వీ రాజ్ కపూర్ రాజ్‌కపూర్‌ల పేర్లు చర్చకు వచ్చాయ. 1948లో తెలుగువారికి రాజ్‌కపూర్ గురించి తెలియదు. ఇక స్ట్క్రిప్ట్ గురించి ఓ వివాదం వచ్చింది. దీనిని విజయచాముండేశ్వరికి చూపించినట్టు ఆమె ఆమోదించినట్టు చెప్పారు. నిన్న జెమిని గణేశన్ కుమార్తె కమలా సెల్వరాజ్ మాట్లాడుతూ ఈ స్ట్క్రిప్ట్ తనకు చూపించలేదు. మా నాన్నను విలన్‌గా ఈ చిత్రంలో చూపించారు. అతను వ్యసనపరుడు, సావిత్రికి తాగుడు అలవాటు చేశాడని ఆమె డబ్బును కాజేశాడని అన్నట్టు చూపించారు. ఇది దుర్మార్గం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఒక సమకాలీన వ్యక్తిపై బయోపిక్ వచ్చినప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవు. అయనప్పటికీ నిర్మాత దర్శకుడు మహానటి యూనిట్ ఒక సాహసోపేతమైన ప్రయత్నాన్ని చేశారు అని చెప్పుకోవాలి. మహానటి సావిత్రి ఫిలిం యూనిట్‌కు శుభాకాంక్షలు.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040- 2742 5668