స్క్రీన్‌ప్లే ప్రధానంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనె్నల క్రియేషన్స్ పతాకంపై శ్రీ విష్ణు, చిత్రశుక్ల జంటగా కుమార్ దర్శకత్వంలో బలగ ప్రకాష్‌రావు రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత బలగ ప్రకాష్‌రావు మాట్లాడుతూ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ పూర్తిచేశామని, పాటలతోపాటు కొంత టాకీపార్టు చిత్రీకరించిన ఈ సినిమాలో కుటుంబంలోని అనుబంధాలు, యాక్షన్‌లకు ప్రాధాన్యత ఉందని తెలిపారు. నేటి యువతరంతోపాటుగా అన్ని వర్గాలవారు ఆశించే నవ్యమైన కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుందని తెలిపారు. కథలోని ట్విస్ట్‌లు ఆకట్టుకునేలా వుంటాయని, త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తామని ఆయన అన్నారు. శివన్నారాయణ, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సురేష్ యువన్, కెమెరా: తమాశ్యామ్, పాటలు: శ్రీమణి, నిర్మాత: బలగ ప్రకాష్‌రావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కుమార్.
(చిత్రం) శ్రీ విష్ణు, చిత్రశుక్ల