అందరికీ నచ్చే అమ్మమ్మగారిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌లో నాగశౌర్య, షామిలి జంటగా కె.ఆర్ సహ నిర్మాతగా రాజేష్ నిర్మిస్తోన్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. మే 25న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ- ఈ సినిమాలో రావు రమేశ్ మన ఇంట్లో కనబడే క్యారెక్టర్‌లో కనిపిస్తారు. సుమిత్ర అమ్మమ్మగారి పాత్రకు అతికినట్లు సరిపోయారు. సుందర్ మంచి కథ చెప్పడమే కాదు చెప్పినట్లు తీశారు. మంచి ప్రొడక్షన్ వేల్యూస్‌తో సినిమాను తెరకెక్కించారు. రసూల్ సినిమాను అద్భుతమైన విజువల్స్‌తో చూపించారు. ఆయనతో ఒకరికి ఒకరు లాంటి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. షామిలి అంటే చిన్నప్పటినుంచి ఇష్టం. తను నటించిన సినిమా చూశాను అన్నారు. దర్శకుడు సుందర్ సూర్య మాట్లాడుతూ- నటీనటులు అందరూ ఈ సినిమా కోసం బాగా కష్టపడి చేశారు. షామిలికి కథ చెప్పాను. ఆమెకు నచ్చడంతో ఏ మాత్రం ఆలోచించకుండా సినిమా చేస్తాను అన్నారు. హీరో నాగశౌర్యకు కథ చెప్పగానే, పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం కాబట్టి చేస్తానని అన్నారు. అలాగే రసూల్ మాటకన్నా పనే ఎక్కువ మాట్లాడుతుంది. అందరికీ కృతజ్ఞతలు అన్నారు. నిర్మాత రాజేష్ మాట్లాడుతూ- ఇంత మంచి సినిమా చేశామంటే కారణం నాగశౌర్య, షామిలి, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహకారమే. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు. హీరోయిన్ షామిలి మాట్లాడుతూ ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది అన్నారు.