గ్లామరే కావాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సగటు ప్రేక్షకుడికి సినిమాయే పెద్ద వినోదం. సినిమాల్లో హీరోలు చేసే యాక్షన్‌లు, డ్యూయెట్లు.. గట్రా ఇష్టం. అలాగే హీరోయిన్ల విషయంలో మాత్రం గ్లామర్ అంటేనే ఆసక్తిని కనబరుస్తారు. అలాగని నటిగా తనని తను ప్రూవ్ చేసుకునే సినిమాలు వచ్చినా సరే చూస్తారు. కానీ సినిమా అంటే హీరోయిన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లామరే. ఒకప్పుడు హీరోయిన్ వేరు, ఇప్పటి హీరోయిన్ వేరు. అప్పట్లో హీరోయిన్ అంటే కథలోంచి పుట్టేది. కానీ నేడు మాత్రం హీరో కోసమే హీరోయిన్ పుడుతోంది. హీరోతో రెండు డ్యూయెట్లు, రెండు రొమాంటిక్ సన్నివేశాలు, టీజింగ్ గట్రా లాంటి వాటితో సరిపెట్టుకుంటుంది. ఇంకొందరు హీరోయిన్లు కేవలం ఒకటి రెండు పాటలకే పరిమితమైన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో హీరోయిన్ల ఉనికి మారుతోంది. ఈమధ్య కొత్తగా వస్తున్న హీరోయిన్లు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలు చేస్తూనే అటు గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ లిస్టులో మొదటగా చెప్పుకోవాల్సింది అనుష్క గురించే. సూపర్ సినిమాలో గ్లామర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క, ఆ తరువాత కొన్ని చిత్రాల్లో అందాలు ఆరబోయడం, డ్యూయెట్లు, రొమాంటిక్ సన్నివేశాలకు పరిమితమైన సందర్భాలూ వున్నాయి. కానీ ఎప్పుడైతే అరుంధతి లాంటి సినిమా చేసిందో, అప్పుడే అనుష్కలోని అసలు టాలెంట్ బయటపడింది. ఈమెలో ఇంత విషయముందా అని సినీ జనాలు షాక్ అయ్యారు. ఆ తరువాత నటిగా ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇక బాహుబలిలో దేవసేనగా తనదైన నటనతో ఆకట్టుకున్న అనుష్క భాగమతి చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మంచి స్క్రిప్ట్‌లు వస్తే హీరోయిన్లు కూడా సత్తా చూపిస్తారని రుజువు చేసింది. ఈ కోవలో మరో హీరోయిన్ నయనతారను చెప్పుకోవాలి. కెరీర్ మొదట్లో గ్లామర్ హీరోయిన్‌గా అడుగులేసిన నయనతార, అటుపై తన ఉనికిని చాటుకుంటూ తనదైన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకుంటోంది. నయనతార జీవితంలో గ్లామర్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న సందర్భాలు ఎక్కువే. సంచలన హీరోయిన్‌గా మారిన ఈమె, ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే మరోవైపు గ్లామర్ హీరోయిన్‌గా కూడా ఆకట్టుకుంటోంది. సినిమాల్లో హీరోయిన్ ఎక్కువకాలం నిలబడాలంటే గ్లామర్ తప్పనిసరి. ఈ విషయంలో బాలీవుడ్ అయితే ఒక అడుగు ముందే వుంటుంది. అక్కడ కేవలం గ్లామర్ హీరోయిన్లకు ప్రేక్షకులు పట్టం కడతారు. తాజాగా రంగస్థలం చిత్రంలో రామలక్ష్మిగా సత్తాచాటిన సమంత అంతకుముందు గ్లామర్ హీరోయిన్ ఏమాయ చేసావె సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత పలువురు స్టార్ హీరోలతో జతకట్టి గ్లామర్ హీరోయిన్‌గానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా వచ్చిన రంగస్థలంలో ఆమె నటనను చూసి జనాలు ఫిదా అయ్యారు. ఈ లిస్టులో చాలామంది హీరోయిన్లు పోటీపడుతున్నారు. అందులో రకుల్‌ప్రీత్‌సింగ్, కాజల్, తమన్నా లాంటివాళ్లు కూడా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక మరికొందరు హీరోయిన్లు నివేదా థామస్, సాయిపల్లవి, అనుపమా పరమేశ్వరన్‌లాంటి హీరోయిన్లు కెరీర్ మొదటినుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా తమ కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు.

- శ్రీ