ప్రేమకథతో కొత్త ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా అజరు భూపతి దర్శకత్వంలో కెసిడబ్ల్యూ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్న చిత్రం ‘ఆర్‌ఎక్స్ 100’. ‘యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్‌స్టోరీ’ అనేది ఉపశీర్షిక. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో కీలక పాత్ర పోషించిన రావు రమేష్ మాట్లాడుతూ- కథను నమ్మి తీసిన చిత్రమిది. సరైన కథ లేకుండా ఎన్ని కష్టాలు పడ్డా ప్రయోజనం శూన్యం. రాంకీ ఇందులో తండ్రి పాత్ర పోషించారు. ఆయన ద్వారా చిత్ర పరిశ్రమకు మరో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు దొరికారు అని అన్నారు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది అని రాంకీ తెలిపారు. దర్శకుడు అజరు భూపతి మాట్లాడుతూ- ఈ చిత్ర టైటిల్ వినగానే యారగెంట్ మనస్తత్వం గుర్తుకొస్తుంది. దూకుడు స్వభావం కలిగిన యువకుడి కథ ఇది. అతను చేసిన పనులు ఇతరుల జీవితాల్లో ఎలాంటి కల్లోలాన్ని సృష్టించాయి, ఈ నేపథ్యంలో అతని ప్రేమ ఎలా సాగిందనే ఆసక్తికర కథాంశంతో రూపొందిస్తున్నాం. ప్రయోగాత్మక ప్రేమకథగా ఇది విభిన్నమైన అనుభూతిని పంచుతుంది. జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు. దర్శకుడు కథ చెపుతున్నపుడే సినిమా చూపించారు. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే చిత్రమని నిర్మాత అశోక్‌రెడ్డి చెప్పారు.