సల్మాన్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సల్మాన్‌ఖాన్ కథానాయకుడిగా అలీ అబ్బాస్ జాఫర్ ‘భరత్’ అనే చిత్రానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్లక ముందే బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భాయ్ ఇటీవలే ‘టైగర్ జిందా హై’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ క్రమంలోనే ‘రేస్ 3’లాంటి క్రేజీ మూవీలో నటిస్తూ వేడి పెంచాడు. ‘రేస్ 3’ ట్రైలర్ ఇటీవల విడుదలై యూత్‌లోకి దూసుకెళ్లిపోయింది. ‘పద్మావత్’ 3డి తరహాలో బాలీవుడ్‌లో మరో క్రేజీ 3డి మూవీగా రేస్ 3 రికార్డులకెక్కనుంది. రేస్‌లో ఇద్దరు వేడెక్కించే కథానాయికలు నటిస్తున్నారు. ఇకపోతే భరత్ చిత్రంలో భాయ్ సరసన కథానాయికలుగా ఎవరు నటిస్తారు అన్న ప్రశ్నకు ఇదివరకే ప్రియాంక చోప్రాను నాయికగా ఎంపిక చేసుకున్నారని ప్రకటించారు. తాజాగా ఈ టీమ్‌కి మరో యంగ్ బ్యూటీ యాడైంది. లోఫర్ ఫేం దిశా పటానీ సల్మాన్ భాయ్ సరసన నాయికగా నటించనుందని తెలుస్తోంది. దిశా నటించిన బాఘి-2 రూ. 100 కోట్ల వసూళ్లతో సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఏకంగా సల్మాన్‌తోనే క్రేజీ ఆఫర్ అందుకుంది.

చిత్రం..దిశా పటానీ