తాళపత్ర గ్రంథం ఆధారంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన చిత్రం ‘అంతర్వేదమ్’. చందిన రవికిషోర్ రచన, దర్శకత్వం వహించారు. ప్రస్తుతం చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సార్‌కు సిద్ధమైంది. జూన్ రెండవ వారంలో ట్రైలర్, ఆడియో రిలీజ్ కార్యక్రమాలు జరగరనున్నాయి. దర్శకుడు రవికిషోర్ మాట్లాడుతూ- మనిషి చనిపోయినపుడు, నిద్రపోయినపుడు, కోమాలో ఉన్నపుడు అతని ఆత్మ ఎటువైపు వెళ్తుంది? ఈ మూడు దశల్లో శరీరం నుంచి బయటకు వెళ్లి ఆత్మలు ఎక్కడ కలుస్తాయి? మనం నిద్రపోయినపుడు మన ఆత్మ మనకి తెలియకుండా ఆ ప్రదేశానికి వెళ్లి చనిపోయినవారిని, మనకు తెలియనివారిని కలిసి వస్తుందా? దీనినే మనం కల అనుకుంటున్నామా? ఇలాంటి విషయాలు వ్రాసి ఉన్న తాళపత్ర గ్రంధం పేరే ‘అంతర్వేదం’. అమర్, సంతోషి, శాలు చౌరాస్య, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ మహేష్, దొరబాబు, రవి, లడ్డు, యోగి నటించిన చిత్రానికి చెందిన రవి కిషోర్ రచన దర్శకత్వం వహించారు. శివ దేవరకొండ కెమెరామెన్‌గా, జె.ఎస్.నిథిత్ సంగీతాన్ని అందించారు.