భాగ్యనగర్‌లో అరవింద సమేత..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత... వీర రాఘవ’. మొదటిసారి తారక్, త్రివిక్రమ్ కలిసి పనిచేస్తుండటంతో ఈ చిత్రం గురించి పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోని కొంపల్లి ప్రాంతంలో జరుగుతోంది. సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు కూడా సూపర్ రెస్పాన్స్ దక్కడంతో టీమ్ మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయకగా నటిస్తోంది. ఎస్.్థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.