‘కాలా’కి లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కాలా’. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడో పూర్తయిన నిర్మాతల మండలి నిరసన కారణంగా వాయిదాపడి చివరికి జూన్ 7వ తేదీన విడుదల కానుంది. ‘కబాలి’ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోయినా రజనీ వెంటనే రంజిత్‌కు అవకాశమిస్తూ చేసిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుంది. సెన్సార్ మెంబర్స్ చిత్రానికి యు/ఎ సర్ట్ఫికెట్ జారీచేశారు. చిత్ర రన్‌టైమ్ 2 గంటల 26 నిముషాలుగా ఉంది. తమిళంతోపాటు తెలుగులో కూడా ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. ధనుష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నానాపటేకర్ ప్రతి నాయకుడిగా నటించారు.