రాజేంద్రప్రసాద్‌కు కళానిధి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైసూరు దత్తపీఠంలో సద్గురు గణపతి సచ్చిదానంద స్వామి పుట్టినరోజు సందర్భంగా డా.రాజేంద్రప్రసాద్‌కు కళానిధి అవార్డుని అందించారు. నాలుగు దశాబ్దాలకు పైగా హీరోగా, కామెడీ స్టార్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటుడు డా.రాజేంద్రప్రసాద్. ఈయనకు కళానిధి అవార్డును బహూకరించిన అనంతరం.. గణపతి సచ్చిదానందస్వామి మాట్లాడుతూ.. ‘‘నాకు హాస్యం అంటే చాలా ఇష్టం. హాస్యానికి కిరీటాన్ని పెట్టిన నట కిరీటికి ఈ కళానిధి అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉంది’’ అన్నారు. డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘నాలుగు దశాబ్దాలుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాను. నటుడిగా ఎన్నో అవార్డులను అందుకున్నప్పటికీ సద్గురు గణపతి సచ్చిదానందస్వామివారి చేతుల మీదుగా కళానిధి అవార్డును స్వీకరించడం ఆనందంగా ఉంది’’ అన్నారు.