14న ‘నా నువ్వే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణ్‌రామ్ తొలిసారి చేస్తున్న పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘నా నువ్వే’. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా నటించారు. టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు సినిమాపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈనెలలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉండటంతో వాయిదాపడి జూన్ 14న విడుదలకానుంది. ఈ కొత్త తేదీని అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మహేష్ కోనేరు సమర్పణలో కూల్‌బ్రీజ్ సినిమా బ్యానర్‌పై విజయ్ వట్టికూటి, కిరణ్ ముప్పవరపులు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శరత్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్.