డిజిటల్ ఇండియా అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంతోపాటు తెలుగులోనూ అదే క్రేజ్ సంపాదించుకున్న విశాల్ తన ప్రతి సినిమాను తెలుగుతోపాటు తమిళంలో విడుదల చేస్తుంటాడు. తాజాగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇరుంబుతెరై’. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని ‘అభిమన్యుడు’ పేరుతో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్ 1న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్‌తో ఇంటర్వ్యూ...
* అభిమన్యుడు తమిళంలో ఎలాంటి విజయం అందుకుంది?
- తమిళంలో ‘ఇరుంబుతిరై’ పేరుతో అభిమన్యుడు సినిమా విడుదలైంది. నా కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకు ఘనవిజయాన్ని అందించారు. తెలుగులో కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. సోషల్ మెసేజ్‌తో వున్న కమర్షియల్ పార్మెట్ మూవీ ఇది.
* ఇంతకీ అభిమన్యుడు కథేమిటి?
- ఇప్పుడు అందరూ డిజిటల్ ఇండియా, ఆధార్‌కార్డ్ అంటున్నారు. దీనివల్ల ఎలాంటి పరిణామాలుంటాయనేది కూడా ఈ సినిమాలో చూపించాం. డిజిటల్ ఇండియా అవసరమా? అనే ప్రశ్నతో సినిమాను ముగించాం. పార్ట్-2 ఉంటుంది.
* కథ వినగానే ఎలా ఫీల్ అయ్యారు?
- కథ వినగానే నా స్మార్ట్ఫోన్ చూసుకున్నాను. అలాగే నా ఫేస్‌బుక్ అకౌంట్‌ను కూడా చూడటం మానేశాను. డిజిటల్ ఇండియాకు వ్యతిరేకంగా నేను సినిమా చేయలేదు. కాని మనం సేఫ్ హ్యాండ్‌లో ఉన్నామా? అని ఆలోచించుకోండి అనే విషయాన్ని చెప్పడానికి ఈ సినిమా చేశాను.
* అర్జున్‌తో నటించడం ఎలా ఉంది?
- అర్జున్ ఈ సినిమాలో గ్రేడ్‌షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. నా సినిమా జీవితం ఆయనతోనే ప్రారంభమైంది. ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ఆయనతో కలిసి నటిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. యాదృచ్ఛికంగా జరిగింది. హీరోకి, విలన్‌కి మధ్య పోటీ చక్కగా కుదిరిందంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో అర్జున్ చెప్పే విషయాలే ప్రస్తుత సమాజంలో జరుగుతున్నాయి.
* హైలెట్ గురించి?
- సమంతతో తొలిసారి నటించాను. తాను అద్భుతమైన నటి. అలాగే అందరూ మిత్రన్ అనే డెబ్యూ డైరెక్టర్‌ని నమ్మాం. యువన్ శంకర్‌రాజా సంగీతం, జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీ సహా మంచి టీం కుదిరింది. మూడేళ్ళ ముందు కథ చెప్పాడు. నచ్చింది. ఆర్మీలో పనిచేసేవారికి రేషన్ కార్డ్, పాస్‌బుక్ ఉండదని కూడా నాకు తెలియదు. ఈ సినిమా చేసే సమయంలో తెలిసింది. అదే విధంగా బ్యాంకులు రైతులకు లోన్ ఇవ్వరు. ఈ విషయాన్ని సినిమాలో డైలాగ్ రూపంలో పెట్టాం. ఇలాంటి సమయంలో అభిమన్యుడు వంటి సినిమా దొరకడం అదృష్టం.
* తెలుగులో ఆలస్యం అవ్వడానికి కారణం?
- సినిమాను తెలుగులో కూడా మేలోనే విడుదల చేయాలని అనుకున్నాం. కానీ మే 11న తెలుగులో చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి రీలీజ్ చేయలేకపోయాం.
* రెస్పాన్స్ ఎలా ఉంది?
- సినిమా స్టార్ట్ కావడానికి ముందు రఫ్ ఎడిషన్ చేశాం. అందుకోసం హాలీవుడ్ తరహాలో టెస్ట్ ప్రివ్యూలు వేశాం. అందుకోసం సాధారణ ప్రేక్షకుల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి సినిమా చూపించాం. వాళ్లు సినిమాను చూసి వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అలా 45 మందికి సినిమాను చూపించి వాళ్ల ఒపీనియన్ తీసుకుని నాలుగుసార్లు ఎడిట్ చేశాం. అలా చేయడంవల్ల సినిమా బాగా వచ్చింది. నా పందెంకోడి 2 సినిమాను రెండు వారాలముందుగానే చూపిస్తాను. మనం చేసేది బావుందని మనం అనుకుంటాం. కానీ బయటినుండి ఒపీనియన్స్ తీసుకోవడంవల్ల సినిమా ఏంటనేది తెలుస్తుంది.
* ఈమధ్య సమాజం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు?
- సినిమా అనేది స్ట్రాంగ్ మీడియం. నా ఫేస్ వేల్యూని నేను ఉపయోగించుకుంటున్నాను. సినిమాను వేల మంది చూస్తారు. కాబట్టి సినిమాల ద్వారా అవేర్‌నెస్ కలిగించవచ్చు. దీనివల్లనాకు తదుపరి సోషల్ అవేర్‌నెస్ సినిమాలు చేయమని ఆఫర్స్ వస్తున్నాయి. క్రైమ్‌కి బలమైన శిక్ష ఉంటే తప్ప చేసేవారు ఆలోచిస్తారు. ఉదాహరణకి రేప్‌కి మరణశిక్ష వేయాలి. అలా చేస్తేనే నేరాలు తగ్గుతాయి.
* రాజకీయాల ఆలోచనతోనే ఇలా యాక్టివ్‌గా ఉన్నారా?
- నేను పొలిటికల్‌గా ఎదగాలనుకుని ఈ సినిమా చేయలేదు. అలా చేస్తేనా కెరియర్ పోతుంది. ఏదో కావాలని చేయలేదు. ఏదీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఈ సినిమా చేశాను. మిత్రన్ కథ వినగానే షాకయ్యాను. నిజాన్ని ఇంతలా చెప్పడం కరెక్టా అని అడిగాను. సినిమా అలా స్టార్ట్ అయ్యింది.
* తదుపరి చిత్రాలు
- ‘టెంపర్’ రీమేక్‌ను కొత్త స్క్రీన్‌ప్లేతో చేయబోతున్నాం. ఈ రీమే క్‌ను కూడా ఎ.ఆర్.మురుగదాస్ శిష్యుడే డైరెక్ట్ చేస్తాడు.

- శ్రీ