నవతరం విజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మిస్తున్న చిత్రానికి ‘విజేత’అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కళ్యాణ్ దేవ్ సరసన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేమ్ మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదలచేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. ‘చిరంజీవిగారి అల్లుడైన కళ్యాణ్ దేవ్ పరిచయ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి చిరంజీవిగారి సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘విజేత’ టైటిల్‌ను ఆయన అల్లుడు హీరోగా తెరకెక్కుతున్న చిత్రానికి పెట్టడం సంతోషంగా ఉంది. కథకు బాగా యాప్ట్ అవుతుంది. ‘బాహుబలి’ చిత్రానికి తన కెమెరా వర్క్‌తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది. పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది. త్వరలోనే టీజర్‌ను విడుదల చేసి, జూలైలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. కళ్యాణ్ దేవ్, మాళవికా నాయర్, తనికెళ్ళ భరణి, మురళీశర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.