భారీ డిమాండ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోవా భామ ఇలియానా అంటే ఇప్పటికీ సౌత్‌లో మంచి క్రేజే. దక్షిణాదిలో గ్లామర్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈమె, బాలీవుడ్‌లో సెటిల్ అవ్వాలని ఇక్కడ వస్తున్న అవకాశాలను కాదనుకుని వెళ్లింది. కానీ బాలీవుడ్‌లో పరిస్థితి మరోలా వుంది. చేసిన రెండు మూడు చిత్రాలు కెరీర్ పరంగా సక్సెస్ ఇవ్వకపోవడంతో అవకాశాలు తగ్గాయి. గత ఏడాది కాలంగా ఒక్క సినిమా చేతిలో లేక ఖాళీగా వుంది. ఈ నేపథ్యంలో మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మాస్ రాజా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో ఓ హీరోయిన్‌గా ఎంపికైందట. ఇటీవలే ఆమెతో చర్చలు జరిపిన దర్శక నిర్మాతలు ఇలియానాను ఓ హీరోయిన్‌గా ఖరారు చేశారు. ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలిసింది. అయితే, ఈ సినిమా కోసం ఇలియానా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని, దానికి ఒప్పుకున్న నిర్మాతలు ఓకె చెప్పడంతో ఇలియానా రీఎంట్రీ కుదిరింది.