నమ్మిన నిజం కోసం పోరాడే ‘ఆఫీసర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలనచిత్ర చరిత్రలో ‘శివ’కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించిన కింగ్ నాగార్జున, సెనే్సషనల్ డైరెక్టర్ రాంగోపాల్‌ర్మల కలయికలో వస్తున్న చిత్రం ‘ఆఫీసర్’. అంతం, గోవిందా గోవిందా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున పవర్‌ఫుల్ ఆఫీసర్‌గా చేయడం మరో విశేషం. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అమల, సుమంత్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, ఎం.ఎం.కీరవాణి, వై.వి.ఎస్.చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ- ఆఫీసర్ గురించి మాట్లాడే ముందు శివ గురించి మాట్లాడాలి. శివ ముందు తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ, శివ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ అని అంటుంటారు. శివ వర్మకు బ్రేక్ ఇస్తే, నాకు అమలను ఇచ్చింది. ఆఫీసర్ సినిమా కోసం ఎంతోమంది కష్టపడ్డారు. ఇంత మంచి యంగ్ టీంతో సినిమా చేసిన వర్మకు థాంక్స్. ఈ కథ చెప్పినపుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. దేశానికి సేవ చేసే ఓ పోలీస్ ఆఫీసర్.. నమ్మిన నిజం కోసం పోరాడే వ్యక్తి అని చెప్పినపుడు ఆ క్యారెక్టర్ చాలా నచ్చింది. వర్మ చిత్తశుద్ధితో ఈ సినిమా చేశాడు. చివరి 20 నిమిషాలుండే యాక్షన్స్ సీన్స్ ఔట్‌స్టాండింగ్‌గా ఉంటాయి. హాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్‌లుంటాయి. చాలా రోజుల తర్వాత రియల్ ఇన్‌టెన్స్ యాక్షన్ ఫిల్మ్ రాబోతోంది అన్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ- నేను క్రైమ్ డ్రామాలు, రౌడీయిజం, యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టపడటానికి ప్రధాన కారణం- నేను చదువుకునే రోజుల్లో వెనుక బెంచీల్లో కూర్చుని చాక్‌పీసులు విసిరేవాళ్ళను ఎక్కువగా చూశాను. తర్వాత స్ట్రీట్ గ్యాంగర్స్‌ను హీరోలుగా చూడటం మొదలుపెట్టాను. దాని తర్వాత గ్యాంగ్‌స్టర్స్, ఫ్యాక్షనిష్టులందరినీ హీరోలుగా చూడటం మొదలుపెట్టాను. అందరూ అయిపోయిన తర్వాత ఆలోచించి పోలీస్ ఆఫీసర్స్ వైపు దృష్టి సారించాను. క్రిమినల్స్ నుంచి సొసైటీని కాపాడటం పోలీస్ ఆఫీసర్స్ వృత్తి. ముంబైలో ఓ పోలీసు ఆఫీసర్ చెప్పిన పాయింట్‌ను ఆధారంగా చేసుకొని ఈ కథను డెవలప్ చేయగానే నా మైండ్‌లో నాగార్జున మెదిలాడు. శివ తర్వాత నేను ఇంతవరకు హీరోయిజం ఉన్న సినిమా చేయలేదు. ఆఫీసర్‌లో నాగార్జున క్యారెక్టర్‌లో కొత్తదనాన్ని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. నాకు శివతో నాగార్జున బ్రేక్ ఇచ్చాడు. ఆఫీసర్ సినిమా నాకు స్పెషల్ మూవీ. నాగార్జునలో చూడాలనుకున్న అల్టిమేట్ హీరోయిజం తెరకెక్కించాను. ఆఫీసర్‌ను నేను ఎంత బాగా క్రియేట్ చేసినా.. నాగార్జున పెర్‌ఫార్మెన్స్‌తో ఎక్స్‌ప్రెషన్స్‌లో ప్రాణం పోశాడు అన్నారు. ఈ కార్యక్రమంలో నాగచైతన్య, అఖిల్ అక్కినేని, ఎం.ఎం.కీరవాణి, మైరా సరీన్ తదితరులు మాట్లాడారు.