యదార్థ సంఘటనలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాజ్‌కిరణ్ సినిమా పతాకంపై ‘విశ్వామిత్ర’ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు చిత్ర యూనిట్. మాధవి అద్దంకి, రజనీకాంత్.యస్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గీతాంజలి, త్రిపుర చిత్రాల దర్శకుడు రాజ్‌కిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శక నిర్మాత తేజ ఎన్టీఆర్ చిత్రపటానికి నమస్కరించి చిత్రపటంపై క్లాప్‌తో సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కిరణ్ మాట్లాడుతూ- ఈ సినిమా స్విట్జర్లాండ్, అమెరికాలలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాం. సినిమా మొదటినుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. నా గత చిత్రాలు గీతాంజలి, త్రిపురలో ఎన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ సినిమాలో కూడా అదే థ్రిల్ మెయిన్‌టెయిన్ చేస్తుంది. జూన్ మూడోవారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మంచి నాయక, నాయికలు దొరికారు. అతి త్వరలో మిగతా విషయాలను తెలియజేస్తాం అన్నారు. ఆకెళ్ళ వంశీకృష్ణ ఈ చిత్రానికి మాటలు రాస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, ఎడిటింగ్: ఉపేంద్ర, నిర్మాతలు: మాధవి అద్దంకి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రాజ్‌కిరణ్.