ఇక స్పీడ్ పెంచేస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు శిరీష్ ఒకరు. ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. నేడు (మే 30) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి.. చేయబోయే చిత్రాల గురించి చెప్పుకొచ్చారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
* ఈ సంవత్సరం రెండు సినిమాలు చేస్తున్నాను. వాటిలో ‘ఏబీసీడీ-అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ’ ఒకటి. ఈ సినిమాను మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేశాడు. ఆ సినిమాకి రీమేక్ ఇది. దీంతో పాటు కె.వి ఆనంద్ దర్శకత్వంలో సూర్య, మోహన్‌లాల్ సినిమాలో కూడా నటిస్తున్నా.
* నేను హీరో సూర్య గారికి అభిమానిని. అలాంటి స్టార్ హీరోతో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ సినిమా జూలై 1నుండి లండన్‌లో ప్రారంభం కానుంది. నేను ఈ సినిమా గురించి ఎక్కువగా రివీల్ చేయలేను. కానీ చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అని మాత్రం చెప్పగలను. ఈ సినిమా గురించి వివరాలు చెప్పాలంటే కె.వి గారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
* ‘ఒక్క క్షణం’ వల్లే ఇదంతా. దర్శకుడు కె.వి గారికి నేనెవరో కూడా తెలీదు. ఆ యూనిట్‌లో నన్ను రిఫర్ చేస్తే ‘ఒక్క క్షణం’ సినిమా చూసి, ఇంప్రెస్ అయి నన్ను ఫిక్స్ చేసుకున్నారు. నాకు రీమేక్ చేయడం చాలా ఇష్టం. మనం అనుకుంటాం కానీ సినిమాని రీమేక్ చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. మన నేటివిటీ విషయానికి వచ్చే సరికి మార్పులు చేసుకోవాలి. ఈ ప్రాసెస్‌లో ఒక్కోసారి సినిమా సోల్ మిస్సయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఏబీసీడీ విషయంలో కూడా మార్పులు చేస్తున్నాం. ముఖ్యంగా క్లైమాక్స్ మారుస్తున్నాం.
* మన సినిమాలు ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. అంత మాత్రాన బాలీవుడ్‌లో కథలు లేక కాదు. అలాగే మనం కూడా. మన దగ్గర చాలా కథలున్నాయి. కానీ వేరే లాంగ్వేజ్‌లో ఏదైనా మంచి సినిమా ఉంటే రీమేక్ చేయడంలో తప్పులేదు.
* నా ప్రతి సినిమా కథ బన్నీ వింటాడు. ఫస్ట్ నాన్న వింటారు. ఆ తర్వాత ఏమైనా మార్పులు ఉంటే చేసి, ఫైనల్ అయ్యాక బన్నీకి ఫ్రెష్‌గా వినిపిస్తా. ఆ తర్వాత సినిమా అయ్యాక ఫైనల్ కాపీ చూస్తాడు.
* 18 నుంచి ఏబీసీడీ షూటింగ్ ప్రారంభిస్తున్నాం. జూన్, జూలై రెండు నెలలు ఇక్కడే షూటింగ్ ఉంటుంది. ఆగస్టులో యు.ఎస్‌కి వెళ్తాం. కథ అక్కడే ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్‌లో సూర్య సినిమా షెడ్యూల్ ఉంటుంది కాబట్టి, ఈ లోపు ఈ సినిమా పూర్తి చేయాలి అనుకుంటున్నాం. కానీ ఇంకా ఏ డేట్ అనుకోలేదు.
* ఏబీసీడీలో హీరో రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉంటాడు. అలాంటి వాణ్ణి ఎలా దారిలో పెట్టాలో అర్థంకాక, ఇండియాని మించిన యూనివర్శిటీ లేదని, నెలకు ఐదువేలు ఇచ్చి ఇక్కడికి పంపిస్తారు. అలాంటి పరిస్థితుల్లో హీరో ఏం చేస్తాడు? పారిపోతాడా? మారతాడా? అనేదే క్యారెక్టర్.
* శ్రీకాంత్ అడ్డాలతో సినిమా వుందా? అని అందరూ అడుగుతున్నారు. ప్రస్తుతానికైతే ఏదీలేదు. మా మధ్య ఎలాంటి చర్చలు కూడా జరగలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చాలా మంది దర్శకులకి కథ చెప్పాక అడ్వాన్స్ ఇస్తారు. అది నాన్న నిర్ణయం.
* నాన్నని, అన్నయ్యని చూస్తే స్లోగా, సంవత్సరానికి ఒక సినిమా చేస్తే ఫోకస్డ్‌గా ఉంటాం అనిపిస్తుంది. కానీ కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వాలంటే స్పీడ్ పెంచాల్సిందే. అందుకే ఇక నుండి సినిమాలు వరసగా చేద్దామనుకుంటున్నా.
* నేను పుట్టినరోజు మహా అయితే ఇప్పటి వరకు మూడు సార్లు జరుపుకుని ఉంటా. నాకు బర్త్‌డేని సెలెబ్రేట్ చేసుకోవడం లాంటివి పెద్దగా ఇష్టం ఉండదు.
* నాకు థియేటర్స్ అంటే చాలా ఇష్టం. సినిమాలు రాకముందే ఉంటే ఎంచక్కా నాటాలు వేసే వాళ్లం కదా అనుకుంటూ ఉంటా. అలాంటిది స్టేజ్‌పై యాంకరింగ్ అంటే కొంచెం అలాంటిదే.. కాబట్టి చేశాను. యాంకరింగ్ అంటే చాలా ఇష్టం.
* నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ సినిమాలంటే జస్ట్ మాస్, మసాలా సినిమాలు. మహా అయితే టాప్‌స్టార్స్ రీమేక్ చేసుకోవడానికి పనికొస్తాయి అనుకునే వాళ్లు. కనీసం కంట్రీలో ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి కూడా మన సినిమాలు పంపడం లేదు. బాలీవుడ్ తర్వాత టాలీవుడ్‌కి ఆ రేంజ్ ఉంది. మన సినిమాలు కూడా ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్ళాలి.
* మన ఇండస్ట్రీలో పది కోట్లు అంటే కామన్ అయిపోయింది. కానీ ఇప్పటికీ కొన్ని భాషల్లో వంద కోట్లు అనేది పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ కూడా వసూలు చేయవు. టాలీవుడ్‌కి అంతరేంజ్ ఉంది. వందకోట్లు మనం అనుకున్నంత మాత్రాన రావు. జరిగిపోతాయంతే.
* ఇనే్నళ్ల నా కెరియర్‌లో తెలుసుకున్నదేమిటంటే సినిమా బావుంటేనే చూస్తారు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చినంత మాత్రాన సినిమాలు చూడరు. దట్సాల్!

-ఎం.డి అబ్దుల్