దెయ్యమే కథ చెబితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరాధ్య ప్రొడక్షన్స్ పతాకంపై పెనాక దయాకర్ రెడ్డి నిర్మాణంలో, ప్రదీప్‌రాజ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం దెయ్యం చెప్పిన కథ. ఈ చిత్రం పోస్టర్‌ను దర్శకుడు కోడి రామకృష్ణ ఇటీవల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- దెయ్యం కథ చెప్పడం అనేది చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందని, దర్శకుడు ప్రదీప్ సినిమాను చక్కగా తెరకెక్కించి ఉంటాడు అని నమ్ముతున్నానని అన్నారు. ఈ చిత్రం తీసుకొచ్చే సక్సెస్‌తో దర్శకుడు ప్రదీప్, నిర్మాత పెనాక దయాకర్‌రెడ్డిలు మరిన్ని సినిమాలు చేయాలని ఆయన అభిలషించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలకు ఆయన శుభకాంక్షలు తెలిపారు. దర్శకుడు ప్రదీప్ మాట్లాడుతూ- గురువుగారు కోడిరామకృష్ణ మా సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. నిర్మాత మాట్లాడుతూ- మా సినిమా పోస్టర్‌ను కోడి రామకృష్ణ ఆవిష్కరించి ఆశీస్సులు అందజేయడం ఒక గొప్ప సక్సెస్‌గా భావిస్తున్నామన్నారు. పూర్తి స్థాయి హర్రర్ చిత్రంగా రూపొందించినటువంటి ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. ఇటీవల రీ రికార్డింగ్ పూర్తిచేసుకుందని నిర్మాత దయాకర్ రెడ్డి తెలిపారు.