ప్రకృతే సాక్ష్యం అయతే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘సాక్ష్యం’. ఈ చిత్రాన్ని జూలై 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తొలుత ఈ చిత్రాన్ని జూన్ 14న విడుదల చేయనున్నామని ప్రకటించినప్పటికీ, సిజి వర్క్ పెండింగ్ ఉండటంతో విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. ‘బాహుబలి’ చిత్రానికి వర్క్ చేసిన మకుట టీం సాక్ష్యం సీజీ వర్క్ చేస్తోంది. దర్శక నిర్మాతలు అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీపడడంలేదు. పంచభూతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచనున్నాడు దర్శకుడు శ్రీవాస్. విడుదలైన టీజర్‌కు విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. మా అంచనాలను మించే స్థాయిలో ప్రేక్షకులు సాక్ష్యం టీజర్‌ను ఆదరించారు. అలాగే విడుదలైన రెండు పాటలుకూడా విశేషమైన ఆదరణ చూరగొన్నాయి. బెల్లకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా వెనె్నల కిషోర్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోషణ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.