అమ్మమ్మగారిల్లులో ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై శ్రీమతి స్వప్న సమర్పణలో నాగశౌర్య, బేబి షామిలి జంటగా సుందర్ సూర్య దర్శకత్వంలో కె.ఆర్. సహనిర్మాతగా రాజేష్ నిర్మించిన ‘అమ్మమ్మగారిల్లు’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యూనిట్ గ్రాండ్ సక్సెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా నటుడు రావురమేష్ మాట్లాడుతూ- ‘అన్ని పాత్రలు సినిమాలో పండాయి. సినిమా బాగుంది అనడానికి ప్రధాన కారణం నాగశౌర్య. ఆ తర్వాత సుధ, శివాజీరాజా పాత్రలు. లాక్ యువర్ ఏజ్ సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆ పాత్రల్లో అంతా ఇన్వాల్వ్ అయి నటించారు. కాబట్టే ఇంత మంచి పేరు వచ్చింది. 2008 నుంచి 2018 వరకూ ప్రతీరోజు నాకు గుర్తుండిపోతుంది. నా అనుభవాలను ఇతరులతో షేర్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ పదేళ్లు నా లాక్ ఏజ్. ఇలాంటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని అన్నారు. సీనియర్ జర్నలిస్టు ఎం.డి. అబ్దుల్ మాట్లాడుతూ- ‘అమ్మమ్మగారిల్లు హాయిగా మనస్సును కదిలించే చిత్రం. ఈ చిత్రంలో నటించిన నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. లాక్ యువర్ ఏజ్ అనేది చక్కటి ఆలోచన. ఇది చిత్రానికి బాగా కలిసొచ్చింది. చక్కటి చిత్రాన్ని అందించిన దర్శక, నిర్మాతలకు అభినందనలు. ముఖ్యంగా రావురమేష్‌గారి నటన చిత్రానికి ఆయువుపట్టు అయింది. ఇక ముందు నిర్మాతలు ఇలాంటి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలి’ అన్నారు. సహ నిర్మాత కె.ఆర్. మాట్లాడుతూ- ‘మా సినిమా హిట్‌చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఇంత గ్రాండ్‌గా ఈవెంట్ చేసుకుంటున్నామంటే కారణం మా టీమ్. ప్రమోషన్‌కు మేము అడగకుండానే నటీనటులు అంతా పాల్గొంటున్నారు. సినిమా ఒక వారం ఆడితే ఇంకా బాగుంటుంది’ అని అన్నారు. దర్శకుడు సుందర్ సూర్య మాట్లాడుతూ, ‘రసూల్ మా సినిమాకు చాలా హెల్ప్ అయ్యారు. కళ్యాణ్‌మాలిక్ ఆయన స్టైల్లో రెండు మెలోడీస్ ఇచ్చారు. సాయికార్తీక్ ఆర్‌ఆర్ నెక్స్ట్‌లెవల్లో అందించారు. జెపి ఎడిటింగ్ బాగా కుదిరింది. రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డారు. నా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన రాము, వంశీ, మధు ఎంతో కష్టపడ్డారు. వాళ్లు భవిష్యత్‌లో గొప్ప దర్శకులు అవ్వాలి. సినిమా విషయానికి వస్తే ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులతో ఎలాచేయాలో చాలా టెన్షన్ పడ్డా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు వాళ్ల సినిమాలు చూస్తూ వచ్చాను. ఇప్పుడు వాళ్ళలా నేను డైరెక్ట్‌చేసాను. వండర్‌ఫుల్ మూవ్‌మెంట్ ఇది. నేను తర్వాత సినిమాలు చేస్తానా? లేదా? అన్నది తెలియదు. నా పనె్నండు ఏళ్ల కల ఈ సినిమా తీర్చింది. ఇక ఇంటికి వెళ్లిపోయినా ఫర్వాలేదు. ఇదొక ఎమోషనల్ జర్నీ. ఈ ఏడాదిన్నర నా లక్ ఏజ్. సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని అన్నారు. నటుడు శివాజీరాజా మాట్లాడుతూ, ‘రాజేష్, కుమార్, సుందర్ చాలా మంచి వ్యక్తులు. వీళ్లు ఇంకా మంచి సినిమాలుచేయాలి. మంచి హిట్లు కొట్టాలి. తెలుగు ఇండస్ట్రీలో వాళ్లముద్ర పడిపోవాలి. నా 45 ఏళ్ల పగా ఈమధ్యనే తీరింది. అదే నా లాక్ ఏజ్’ అని అన్నారు. నటి హేమ మాట్లాడుతూ, ‘ప్రతీ పాత్ర వేటికవి ప్రత్యేకంగా ఉన్నాయి. చాలారోజుల తర్వాత మంచి సినిమాచేసాను. అంతా పాత్రలు నమ్మి సినిమాచేసాం. ఈరోజు మా నమ్మకం నిజమైంది. మంచి సినిమా చేసామని అంతా గర్వంగా చెప్పుకుంటున్నాం. లాక్ యువర్ ఏజ్ అనేది ఇబ్బందిగా ఉందని సెట్స్‌లో అనుకున్నాం. కానీ సినిమాకు అదే ఆయువుపట్టులా నిలిచింది. సినిమా గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నారు అంటే కారణం ‘లాక్ యువర్ ఏజ్’ అన్నదే కారణం అని అన్నారు. సుధ మాట్లాడుతూ, ‘రీల్‌లైఫ్‌లోనే కాదు. రియల్ లైఫ్‌లో కూడా ఏడిపించే తమ్ముడు ఉన్నాడు. రెండు నాకు బాగాకనెక్ట్ అయ్యాయి. టూ వీలర్ నేర్చుకోవడం నా లాక్ ఏజ్. రిలేషన్స్ నెవర్ ఎండ్. ఇది అందరికీ సంబంధించింది. అందుకే సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌అయింది’ అని అన్నారు. ఇంకా ఈ వేడుకలో మధుమణి, రూపలక్ష్మి, శక్తి, చందు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.