థ్రిల్లింగ్ నేపథ్యంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మిప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై కార్తీక్ ఆనంద్, డింపుల్, షాలినీ, మున్నా, అపూర్వ హీరో హీరోయిన్లుగా ప్రశాంత్ తాత, లలితకుమారి నిర్మిస్తోన్న చిత్రం ‘యురేక’. కార్తీక్ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోస్‌లో చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత లలితకుమారి మాట్లాడుతూ- చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సినిమా ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నామన్నారు. నిర్మాత ప్రశాంత్ మాట్లాడుతూ- సినిమా 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. జూలై ఫస్ట్‌వీక్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ- ఇది నా రెండో చిత్రం. సినిమాలో నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందన్నారు. కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ- యురేకతో హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్నాను. కథే ఈ చిత్రానికి బలం. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. యురేక అంటే ఓ కొత్త విషయాన్ని కనిపెట్టడం ద్వారా వచ్చే హ్యాపీనెస్. అదేంటనేది సస్పెన్స్. నిర్మాతలు రాజీపడకుండా నిర్మిస్తున్నారన్నారు. చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్, ఆర్ట్: అవినాష్, నిర్మాతలు:ప్రశాంత్ తాత, లలిత కుమారి, దర్శకత్వం:కార్తీక్.