బెల్లంకొండ షూటింగ్‌లో కాజల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్‌చేసిన శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని (నాని) నిర్మించనున్నారు. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలో ఈ చిత్ర టైటిల్‌ను అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ చిత్ర హిందీ శాటిలైట్ రైట్స్ 9 కోట్ల 50 లక్షలకు అమ్ముడు అయ్యాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించబడుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితీష్ ముఖేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన ఒక ప్రత్యేక సెట్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ మధ్య కొన్ని కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత అబ్బూరి రవి మాటలు రాస్తున్నారు. హర్షవర్ధన్ రాణే ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో సత్యం రాజేష్, కళ్యాణి నటరాజన్, అపూర్వ ఈ మూవీలో మరో ఇంపార్టెంట్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చాగంటి శాంతయ్య కోప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. రంగస్థలం సినిమా తరువాత చంద్రబోస్ ఈ సినిమాకు సింగిల్ కార్డు రచయితగా పనిచెయ్యడం విశేషం. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్, నీల్ నితీష్ ముఖేష్, అజయ్, పోసాని కృష్ణమురళి, హర్షవర్ధన్ రాణే, సత్యం రాజేష్, కళ్యాణి, నటరాజన్, అపూర్వ తదితరులు నటిస్తున్నారు.