ఐపిసి సెక్షన్.. భార్యాబంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఒక ముఖ్యమైన సెక్షన్‌ను ఆధారం చేసుకుని రూపొందుతున్న వినూత్న కుటుంబ కథా చిత్రం ‘ఐపిసి సెక్షన్... భార్యాబంధు’ ‘సేవ్‌మెన్ ఫ్రమ్ ఉమెన్’ అన్నది స్లోగన్. దర్శకత్వ శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన రెట్టడి శ్రీనివాస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆలూరి క్రియేషన్స్ పతాకంపై ఆలూరి సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రం పాటలు విడుదల కార్యక్రమం జరిగింది. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, దర్శకులు ఎన్.శంకర్, దేవీప్రసాద్‌లతోపాటు యూనిట్ సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. శరశ్చంద్ర హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో నేహాదేశ్‌పాండే హీరోయిన్. నిన్నటి మేటి కథానాయకి ఆమని ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఒక్కో పాటను ఒక్కో అతిథి విడివిడిగా విడుదల చేయగా, బిగ్ సీడీని సి.కళ్యాణ్ ఆవిష్కరించారు. సీడీ బాక్స్ ఎం.శంకర్ విడుదల చేసి తొలి ప్రతిని దేవీప్రసాద్‌కి అందించారు. విజయ్ కురాకుల సంగీతం అందించిన ఈ చిత్రానిక వౌనశ్రీ మల్లిక్ సాహిత్యం సమకూర్చారు. ‘లహరి మ్యూజిక్’ ఈ చిత్రం ఆడియో హక్కుదార్లు. కానె్సప్ట్ బేస్డ్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఒక సున్నితమైన అంశానికి సునిశిత హాస్యాన్ని జోడించి రూపొందించిన ‘ఐపిసి సెక్షన్... భార్యాబంధు’ మంచి విజయం సాధించాలని అతిధులు అభిలషించారు. నిర్మాత ఆలూరి సాంబశివరావు మాట్లాడుతూ ‘సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చర్చించిన అంశం గురించి మాట్లాడుకుంటారు’ అన్నారు. తనకు దర్శకుడిగా అవకాశమిచ్చి.. విడుదలయ్యాక అందరూ గొప్పగా మాట్లాడుకునే మంచి సినిమా తీసే అవకశం ఇచ్చిన నిర్మాత ఆలూరి సాంబశివరావు గారికి, కార్యక్రమాకి విచ్చేసిన అతిథులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని దర్శకుడు రెట్టడి శ్రీనివాస్ అన్నారు. హీరోగా పరిచయమవుతున్న శరశ్చంద్రకి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని, ఆమని పాత్ర, విజయ్ కురాకుల సంగీతం, వౌనశ్రీ మల్లిక్ సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలని పేర్కొన్నారు. ఈ చిత్రానికి పనిచేసే అవకాశం లభించడం పట్ల విజయ్ కురాకుల, వౌనశ్రీ మల్లిక్ కృతజ్ఞతలు తెలియజేశారు. మధునందన్, వాస ఇంటూరి, భరత్ (్ఫన్ బకెట్), బస్‌స్టాప్ కోటేశ్వరరావు, అప్పలరాజు, తడివేలు, రాగిణి, రమణీచోదరీ, మహిజ, రష్మీ, ఇంద్రాణి, సంగీత ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి.. మాటలు: అల్లూరి సీతారామరాజు, కాలపు శ్రీనివాస్, పాటలు: వౌనశ్రీ మల్లిక్, ఆర్ట్: కె.వి.రమణ, కో-డైరెక్టర్: కె.సేతుపతి, రచనా సహకారం: చీఫ్ కో డైరెక్టర్: బి.సుధాకర్‌రాజు, ఎడిటింగ్: బి.మహేంద్రనాథ్, సినిమాటోగ్రఫీ: పి.శ్యామ్, సంగీతం: విజయ్ కూరాకుల, నిర్మాత: ఆలూరి సాంబశివరావు, కథ- స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: రెట్టడి శ్రీనివాస్.