2న డాక్టర్ సత్యమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యశ్వంత్ మూవీస్ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఒరుముకతరై’ చిత్రాన్ని తెలుగులో ‘డాక్టర్ సత్యమూర్తి’గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల చేస్తున్నారు డి.వెంకటేష్.. ఈ సందర్భంగా నిర్మాత వెంకటేష్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ముచ్చటించారు. రహమాన్ (రఘు) టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం తమిళనాడులో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రెజెంట్ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే స్టోరీ కనుక. ఇది యువతీ యువకులతోపాటు అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకర్షించింది. హైదరాబాద్‌తో కలిపి వందకు పైగా కేంద్రాల్లో విడుదల చేస్తున్నాము. పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఫేస్‌బుక్‌లో ఫేక్ ఐడిని క్రియేట్ చేసి టీనేజ్ అమ్మాయిలను లోబర్చుకొనే డాక్టర్ చేసే వికృత చేష్టలకు ప్రతిరూపం ఈ చిత్రం. మధ్యవయస్కుడైన సైకాలజిస్ట్ డాక్టర్ టీనేజ్ అమ్మాయిలను ఎలా లోబర్చుకున్నాడు. ఎలా మభ్యపెడుతున్నాడు, ఎలా తన బుట్టలో వేసుకుంటున్నాడన్న ఇతివృత్తంతో ఆద్యంతం ఈ చిత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించినప్పుడే ఖచ్చితంగా తెలుగులోకూడా ఈ రేంజ్ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో రొమాన్స్ సన్నివేశాలు ఉంటాయి కానీ అవి వల్గర్‌గా లేకుండా కథానుసారంగా వుంటాయి. యూనివర్సల్ సబ్జెక్ట్‌ని భాషాబేధం లేకుండా అందరూ ఆదరిస్తున్నారనే నమ్మకంతోనే ఈ చిత్రాన్ని కొన్నాను. నా నమ్మకం వమ్ముకాలేదు. వరుసగా డబ్బింగ్ సినిమాలే చేయటానికి కారణం ఉంది. మొదట్లో నేను స్ట్రైట్ చిత్రాలు చేసేందుకే చిత్ర రంగంలోకి ప్రవేశించాను. కానీ ఈరోజు పరిస్థితి స్ట్రైట్ సినిమా చేయాలంటే మినిమం రూ. 3 కోట్లు- రూ.10 కోట్లు కావాల్సిందే. అదే ఓ డబ్బింగ్ చిత్రమైనా తక్కువ మొత్తంలో రైట్స్ తీసుకొని విడుదల చేసుకునే అవకాశం ఉంటుంది. నేను చేసే తమిళ చిత్రాలు కూడా అక్కడ భారీ బడ్జెట్‌తో నిర్మించినవే. తెలుగులోకి వచ్చేటప్పటికి అవి డబ్బింగ్ చిత్రాలుగా అనిపిస్తున్నాయి. భవిష్యత్తులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తే పెద్ద హీరో కాల్షీట్లు దొరికిన తరువాతే. నేను అందించబోతున్న సినిమాల్లో ‘తారామణి’ చిత్రం ఈ నెల 8వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రం ‘మహానటి’ రేంజ్‌లో ఉండి ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇక పిజ్జా-2 చిత్రం ఈ నెలాఖరులో ఉంటుంది.ఇది కూడా వినూత్నమైన కానె్సప్ట్‌తో రూపుదిద్దుకున్న చిత్రమే. తమిళంలో సూపర్ హిట్ చిత్రాలను మా త్రమే తెలుగు లో తెస్తున్నా ను అన్నారు.