సూపర్‌స్టార్ పుట్టిన రోజు సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహసాల హీరో తెలుగు సినీ ఖ్యాతికి చెరగని చిరునామా. పద్మభూషణ్ డా.సూపర్‌స్టార్ కృష్ణ ‘తేనె మనసులు’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై అశేష ప్రేక్షకాభిమానాన్ని ఏర్పరచుకున్న నట శేఖరుడు. 50 సంవత్సరాలుగా అలుపెరుగని శ్రామికునిలా సినీ జగత్తులో 350 చిత్రాలకు పైగా నటించి సరికొత్త రికార్డులను నెలకొల్పడం సూపర్‌స్టార్ కృష్ణకే సాధ్యం. ఆయన 76వ జన్మదినోత్సవ వేడుకలు మే 31న హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ పుట్టినరోజు మహోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి అభిమానులు తరలివచ్చి కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, ప్రముఖ నిర్మాతలు ఆదిశేషగిరిరావు, కె.ఎస్.రామారావు, సి.కళ్యాణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ పాల్గొన్నారు. భారీగా ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ అనంతరం కృష్ణ మాట్లాడుతూ ‘నేను సినిమాలు చేసినా, చేయకపోయినా అటు ఇండస్ట్రీ, ఇటు అభిమానులు ఎంతోమంది వచ్చి బర్త్‌డే శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఏ సినిమా చెయ్యలేదు. అయినా పెద్దఎత్తున అంబరాన్నంటిన ఉత్సాహంతో అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలనుండి వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. వచ్చే సంవత్సరం మరింత గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి’ అన్నారు. శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ ‘చాలా దూరాల నుండి అభిమానులు అంతా వచ్చి కృష్ణగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్’ అన్నారు. ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ‘నా చిన్నప్పుడే సూపర్‌స్టార్ కృష్ణగారు ‘జేమ్స్‌బాండ్’, కౌబాయ్ వంటి ఎన్నో సాహస చిత్రాలు తీసి అనేక ప్రయోగాలు చేశారు. హీరోగానే కాకుండా, దర్శకుడిగా నిర్మాతగా స్టూడియో అధినేతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. హీరోగా ట్రెండ్ సెట్ చేశారు. నిర్మాతలందరికీ ఒక మార్గదర్శకంగా నిలుస్తూ గొప్ప చిత్రాలు ఎన్నో తీశారు’ అన్నారు. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లడుతూ ‘కృష్ణగారు అభిమానులకి సూపర్ స్టార్ కావచ్చు. కానీ నిర్మాతలకు ఆయన దేవుడు. నాకు వున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అలాంటి మంచి మనసున్న మనిషి ఇప్పటివరకు పుట్టలేదు. పుడతారో లేదో తెలీదు. నిర్మాతల కష్టసుఖాల గురించి ఆలోచించే ఏకైక హీరో కృష్ణ’ అన్నారు. దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ ‘తెలుగు సినిమా రంగానికి కొత్త వెలుగులు అద్ది.. సూపర్ స్టార్ అనే పదానికి సరికొత్త అర్థం చెప్పిన కృష్ణగారు కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా చూసి కృష్ణగారికి వీరాభిమానిని అయ్యాను. ఆయన ఆశీస్సులతో దర్శకుడ్ని కాగలిగాను. మంచి మనసున్న సూపర్‌స్టార్ కృష్ణగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అన్నారు.