జూలై 5న ‘ఆటగాళ్ళు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నారా రోహిత్, జగపతిబాబు నటిస్తోన్న సినిమా ‘ఆటగాళ్ళు’. ‘ఆంధ్రుడు’ చిత్ర దర్శకుడు పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర నిర్మాతలు. బ్రహ్మానందం ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఆటగాళ్ళు సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో దర్శనా బానిక్ హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇంట్రెస్టింగ్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు గేమ్ ఆఫ్ లైప్ అనే ట్యాగ్‌లైన్ పెట్టడం జరిగింది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. నారా రోహిత్, జగపతిబాబు పాత్రలు ఈ సినిమాకు ప్రధాన బలం కాబోతున్నాయి. సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమకు విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నారా రోహిత్, జగపతిబాబు, బ్రహ్మానందం, దర్శనా బానిక్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి దర్శకత్వం: పరుచూరి మురళి, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కేనా రాము, వడ్లపూడి జితేంద్ర, బ్యానర్: ఫ్రెండ్స్ మూవీస్ క్రియేషన్స్, సంగీతం: సాయికార్తీక్, కెమెరామెన్: విజయ్ సి.కుమార్.