అల్లు శిరీష్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించగా.. సూపర్ డూపర్ హిట్టయిన ఏబీసీడీ (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్‌డ్ దేసి) చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన నటించే లక్క్ఛీన్స్ రుక్షార్ థిల్లాన్ సొంతం చేసుకుంది. ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో రుక్షార్ అందరి హృదయాల్ని దోచేసింది. సంజీవ్‌రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టును మధుర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మధుర శ్రీ్ధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యస్.రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని కోప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధాసాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా.. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో అల్లుశిరీష్‌తో నిర్మిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మలయాళంలో దుల్కర్ పోషించిన పాత్రను తెలుగులో శిరీష్ పోషిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులంతా హ్యాపీగా ఎంజాయ్ చేసే కథ కావడంతో రీమేక్ చేస్తున్నాం. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అల్లు శిరీష్ సరసన కృష్ణార్జునయుద్ధం ఫేం రుక్షార్ థిల్లాన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశాం. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుదాసాంధీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. దర్శకుడు సంజీవ్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులు మెచ్చేవిధంగా కథను తీర్చిదిద్దారు. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసే ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని అన్నారు.