కొరటాలకు గ్రీన్ సిగ్నల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 151వ చిత్రం సైరా. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈనెల 7 నుండి మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ పూర్తయితే దాదాపు 80శాతం షూటింగ్ పూర్తిఅయినట్టే. దాంతో మిగతా షూటింగ్ కూడా త్వరలోనే పూర్తిచేయాలని ప్లాన్‌చేసాడు చిరంజీవి. దాంతోపాటు ఆయన క్రేజీ దర్శకుడు కొరటాల శివకు ఓకే చెప్పినట్టు టాక్? కొరటాల శివ సినిమాకు సైరా గ్యాప్‌లో చేయాలని ఫిక్స్‌ అయ్యాడట చిరు. అందుకే ఆయనకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. సైరా వచ్చే సంక్రాంతికి విడుదల ప్లాన్ చేసారు కాబట్టి.. ఈలోగా కొరటాల సినిమా విడుదల చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారట. సో ఇప్పటికే స్క్రిప్ట్‌వర్క్ విషయంలో బిజీగా ఉన్న కొరటాల త్వరలోనే ప్రీప్రొడక్షన్ పనులు మొదలుపెడతారట. లేటెస్ట్‌గా మహేష్‌తో ‘భరత్ అనే నేను’తో సంచలన విజయం అందుకున్న కొరటాల శివ వెంటనే.. మెగాస్టార్‌తో సినిమా ఛాన్స్ పట్టేయడం విశేషం.