14న జంబలకిడిపంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జంబలకిడి పంబ’అనే పేరు వినగానే నరేశ్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ చేసిన నవ్వుల సందడి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీనివాసరెడ్డి కథానాయకుడు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి వైవిధ్యమైన సినిమాలతో కథానాయకుడిగా అడుగులు వేసిన శ్రీనివాసరెడ్డి నటిస్తోన్న తాజా సినిమా ఇది. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని కథానాయిక. పోసాని కృష్ణమురళి, వెనె్నల కిశోర్ కీలక పాత్రదారులు. జె.బి.మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు. రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి. ఎస్ నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘శ్రీనివాసరెడ్డి నాకు క్లోజ్ ఫ్రెండ్. నా ప్రతి సినిమాలో మంచి పాత్రలు చేస్తుంటారు. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కాకుండా, కానె్సప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. జంబలకిడి పంబ స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఐడియా చెప్పారు. నాకు నచ్చింది. సినిమాగా ఎలా ఉంటుందో అని అనుకున్నా.. కానీ శ్రీనివాసరెడ్డి శ్రీగా, సిద్ధిగారు సిద్ధుగా చేశారు. వాళ్ల పాత్రల్ని తెరమీద చూడాలనిపిస్తోంది. ప్రమోషనల్ సాంగ్ చూసిన తర్వాత టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెప్పాలనిపించింది. ఈవీవీగారి జంబలకిడి పంబ సినిమా మనందరికీ ఇప్పటికీ గుర్తే. ఆడవాళ్లు మగవాళ్లుగా మారడం, మగవాళ్లు ఆడవాళ్లుగా మారడం వంటివి అప్పట్లో చాలా తమాషాగా చూశాం. ఈ సినిమా అంతకన్నా పెద్ద హిట్‌కొట్టాలి’’అని చెప్పారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ‘‘పిలవగానే వచ్చి అనిల్‌రావిపూడి మా ప్రమోషనల్ సాంగ్‌ని లాంచ్ చేసినందుకు చాలా థాంక్స్. ఈనెల 14న సినిమా విడుదల కానుంది. నా దగ్గరికి మనుగారు వేరే కథతో వచ్చారు. మాటల్లో ఈ కథ చెప్పగానే చాలా బాగానచ్చింది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు’’అని అన్నారు. హీరోయిన్ మాట్లాడుతూ.. ‘‘మా దర్శకుడు చాలా బాగా డైరెక్ట్ చేశారు. శ్రీనివాస్‌గారు లేకపోతే నేను తెలుగులో ఈ సినిమా చేసేదాన్ని కాదేమో. ప్రోమో సాంగ్ కొరియోగ్రఫీ చాలా బావుంది’’అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘ప్రమోషనల్ సాంగ్ కానె్సప్ట్ కథ అనుకున్నప్పటి నుంచే ఉంది. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఒక బడ్జెట్‌లో ఈ సాంగ్‌ని చేయాలి. ఆ బడ్జెట్ లేకపోతే చేసి వేస్ట్. అప్పటికే నిర్మాతలు చాలా పెట్టారని నేనే వాళ్ళకి ఈ సాంగ్ గురించి అడగలేదు. కాకపోతే ముందునుంచీ గోపీసుందర్‌కి ఈ సాంగ్ గురించి తెలుసు. ఆయనే ఒక ట్యూన్ పంపించారు. అది తెలుసుకుని నిర్మాతలు ‘‘ఏం ఫర్వాలేదు. పాట చేయి. మేం పెడతాం’అని ఖర్చుకు వెనుకాడకుండా పెట్టారు. ఈ క్రెడిట్ వాళ్ళదే. సీజీ వర్క్ డెమీ గాడ్ అని సుశాంత్ వాళ్లు చేశారు. గేయ రచయిత కాసర్ల శ్యామ్, డ్యాన్స్ మాస్టర్ భానుగారు అందరూ తక్కువ టైమ్‌లోనే ఈ సాంగ్‌ని పూర్తిచేశారు’’అని చెప్పారు. నిర్మాత రవి మాట్లాడుతూ.. ‘ఈ కథను మను 45 నిమిషాల్లో చెప్పారు. శ్రీనివాసరెడ్డిగారి కోసమే కథను రాసుకున్నట్టు తెలిపారు. డిస్ట్రిబ్యూటర్‌గా చాలా సినిమాలు చేశాం. నిర్మాతగా మేం మొదలుపెట్టిన ఈ సినిమా. మమ్మల్ని మేం ప్రూవ్ చేసుకునేలా ఉండాలని అనుకున్నాం. ఈనెల 14న విడుదల చేస్తాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నాం’’అని చెప్పారు.