బగ్గిడి గోపాల్ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బగ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘బగ్గిడి గోపాల్’. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బగ్గిడి గోపాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జయసూర్య సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో జరిగింది. మాజీ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు గవర్నర్ రోశయ్య, నటి జమున, ఎపిసిస ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి, మాజీ మంత్రి మారెప్ప తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆడియో సీడీని రోశయ్య విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అందజేశారు. అనంతరం బగ్గిడి గోపాల్ మాట్లాడుతూ- నేను స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. అంబేద్కర్, నెహ్రూను కాదు. మామూలుగా అయితే నా బయోపిక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నా జీవితంలో యువతకు స్ఫూర్తినిచ్చే ఎన్నో అంశాలున్నాయి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను ఒక బస్సు కండక్టర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగాను. నన్ను ఎన్నుకున్న ప్రజల పక్షాన నిలబడ్డాను. రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నాను. ఇవి కొందరికి నచ్చక నన్ను అణగద్రొక్కే ప్రయత్నాలు చేశారు. నా జీవితాన్ని కథగా రాస్తే ఎవరు చదవరు. కాబట్టి రంగుల ప్రపంచమైన సినిమా ద్వారా ఇదంతా చెప్పాలనుకున్నాను. నేను ఎవరినీ మోసం చేయలేదు అని చెప్పాలనే నా 35 ఏళ్ళ మనోవేదనకు ప్రతిరూపమే ఈ బగ్గిడి గోపాల్ చిత్రం. సినిమాలో ఎనిమిది పాటలు బాగా వచ్చాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అన్నారు. దర్శకుడు అర్జున్‌కుమార్ మాట్లాడుతూ- ఒక సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం బగ్గిడి గోపాల్ దగ్గరకు వెళ్ళాను. ఆయన తన బయోపిక్ చేయాలనే ఆలోచన గురించి చెప్పారు.