పునర్జన్మల నేపథ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత దర్శకుడు రాజవౌళి తదుపరి చిత్రం ఏదనే ఆసక్తి అందరిలో నెలకొన్న విషయం తెలిసిందే. దాంతో కొద్ది గ్యాప్ తరువాత ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేస్తానని చెప్పడంతో ఆసక్తి మరింత ఎక్కువైంది. దానికి కారణం, ఒకరు నందమూరి హీరో అయితే, మరొకరు మెగాహీరో. ఈ ఇద్దరి కలయికలో సినిమా అంటే సాధారణ ప్రేక్షకుడికి కూడా విపరీతమైన ఆసక్తే. ఈ సినిమా గురించి ప్రకటించినప్పటినుంచీ రకరకాల వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో వుంటుందని వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు చరణ్ పోలీసు పాత్రలో కన్పిస్తే, ఎన్టీఆర్ గ్యాంగ్‌స్టర్‌గా ఉంటాడట. ఈ విషయంలో నిజనిజాలు ఎలా వున్నా ఈ సినిమా గురించి పుకార్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి. పునర్జన్మల కానె్సప్టుతో రాజవౌళి తీసిన రెండు చిత్రాలు సంచలన విజయం సాధించడంతో ఈ సినిమా కూడా అదే కోవలో వుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.