మెగాస్టార్ ముఖ్యఅతిథిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్’, ‘ఐ లవ్ యు’ అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగంగా ఎడిటింగ్, డబ్బింగ్ జరుగుతోంది. జూన్ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలిప్రేమ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ వంటి రొమాంటిక్ చిత్రాలను అందించిన ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో వస్తోన్న మరో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. మంచి లవ్ ఫీల్‌తో సాగే ప్రేమకథా చిత్రంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఎన్నో సూపర్ డూపర్ మ్యూజికల్ మెలోడీస్ అందించిన సంగీత దర్శకుడు గోపీసుందర్ సంగీత సారథ్యంలో ఈ సినిమా పాటలు విడుదల కానున్నాయి. జూన్ 9న హైదరాబాద్ జెఆర్‌సి కనె్వన్షన్ సెంటర్‌లో జరుగబోతున్న ఈ ఆడియో ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా విచ్చేస్తున్నారు.ఈ చిత్రానికి ఎడిటర్: ఎస్.ఆర్. శేఖర్, సంగీతం: గోపీసుందర్, కెమెరా: ఆండ్రూ.ఐ, మాటలు:డార్లింగ్ స్వామి, నిర్మాత: కె.ఎస్.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్.