15న సమ్మోహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనూహ్యమైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన ‘సమ్మోహనం’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సుధీర్‌బాబు హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సమ్మోహనం’. బాలీవుడ్ భామ అతిథిరావు హైదరీ ఇందులో నాయికగా నటించారు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ- మేం ముందుగా అనుకున్న విధంగానే సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు మెచ్చుకున్నారు. క్లీన్ యు సర్ట్ఫికెట్ ఇచ్చారు. ఈనెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు. దర్శకుడు మోహనకృష్ణ మాట్లాడుతూ- రొమాన్స్, హాస్యం సమ్మిళితమైన కథ ఇది. పి.జి.విందా ఫొటోగ్రఫి హైలెట్ అవుతుంది. వివేక్ సాగర్ ట్యూన్లు ఆకట్టుకుంటాయి. టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా మొత్తం అందమైన ఫీల్ క్యారీ అయి సమ్మోహనంగా అనిపిస్తుంది. ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు.