నవ్వుల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంబలకిడి పంబ పేరు వినగానే నరేష్ హీరోగా ఇవివి సత్యనారాయణ చేసిన నవ్వుల సందడి గుర్తుకొస్తుంది. తాజాగా అదే పేరుతో శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతోంది. శివమ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెక్కిస్తున్నాయి. సిద్ధి ఇద్నాని కథానాయిక. జె.బి.మురళీకృష్ణ (మను) దర్శకత్వం వహిస్తున్నారు. రవి, జోజో జోస్, ఎన్.శ్రీనివాస్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ- శ్రీనివాస్‌రెడ్డి నా ప్రతి సినిమాలో మంచి పాత్రలు చేస్తుంటారు. ఆయన కేరెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా, కానె్సప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నారు. ఈ చిత్రం స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఐడియా చెప్పారు. నాకు నచ్చింది. ప్రమోషనల్ సాంగ్ చూసిన తర్వాత టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెప్పాలనిపించింది. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పిలవగానే వచ్చిన అనిల్ రావిపూడి మా ప్రమోషనల్ సాంగ్‌ని లాంచ్ చేసినందుకు చాలా థాంక్స్. జూన్ 14న సినిమా విడుదల కానుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా తెరకెక్కించారు అన్నారు. హీరోయిన్ మాట్లాడుతూ- మా దర్శకుడు చాలా తీశారు. శ్రీనివాస్ లేకపోతే నేను తెలుగులో సినిమా చేసేదాన్ని కాదేమో. ప్రోమో సాంగ్, కొరియోగ్రఫి చాలా బావుంది అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ- ప్రమోషనల్ సాంగ్ కానె్సప్ట్ కథ అనుకున్నప్పటినుంచే ఉంది. షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఒక బడ్జెట్‌లో ఈ సాంగ్‌ని చేయాలి. కాకపోతే ముందునుంచీ గోపీసుందర్‌కి ఈ సాంగ్ గురించి తెలుసు. ఆయనే ఒక ట్యూన్‌ను పంపించారు.