ప్రేమెంత పనిచేసే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెఎస్‌ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డ హీరోగా పరిచయంచేస్తూ.. ప్రముఖ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’ ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో రిలీజ్‌కి రెడీఅయ్యింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను మాస్ మహారాజా రవితేజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో రవితేజ మాట్లాడుతూ.. చిత్ర హీరో హరి చాలా బాగా డాన్స్‌లు చేశాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అతనికి అతని హైటు ప్లస్. ఈ సినిమా పాటలు, ట్రైలర్ మరియు కొన్ని సీన్స్ చూశాను. హరి చాలా బాగా నటించాడు. అతను భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి తప్పకుండా వెళ్తాడు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్‌రావుతో నాకు మంచి అనుబంధం ఉంది. అతనికి ఈ సినిమా మంచి విజయంతోపాటు డబ్బులుకూడా తెస్తుంది అనే నమ్మకం ఉంది. సినిమా చాలా రిచ్‌గా ఉంది. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అని అన్నారు. చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాకు ఎంతో ఇష్టమైన హీరో రవితేజ. మా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో కొన్ని పాటలు, కొన్ని సన్నివేశాలు రవితేజగారికి చూపించడం జరిగింది. మా అబ్బాయి హరిని రవితేజగారు అభినందించడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. సినిమా మొత్తం పూర్తిఅయ్యింది. త్వరలో ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల చేయనున్నాం. ఈనెల చివరివారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. హరికృష్ణ జొన్నలగడ్డ (తొలి పరిచయం), అక్షిత, ఝాన్సి, చిలుకూరి గంగారావు, ఏఆర్‌సి బాబు, రాహుల్ బొకాడియా, పింగ్‌పాంగ్, రాఘవ పూడి తదితరులు నటిస్తున్నారు.