మిస్టర్ హేమానంద్ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేమానంద్, పావని నాయకానాయికలుగా నటిస్తోన్న చిత్రం ‘మిస్టర్ హేమానంద్’. జైరామ్‌కుమార్ దర్శకత్వంలో ఓం తీర్థం ఫిల్మ్ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం హైదరాబాద్‌లో జరిగింది. సీడీని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహీందర్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సీడీలను నిర్మాత మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించి తొలి ప్రతిని మహీందర్‌రెడ్డికి అందించారు. అనంతరం మంత్రి మహీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా బాగుంటుందని ఆశిస్తున్నా. రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా.. కొత్తవాళ్లు అయినప్పటికీ అంతా బాగా నటించారు. ట్రైలర్ బాగుంది. పాటలు, సినిమా పెద్ద విజయం సాధించి టీమ్ అందరికీ మంచి పేరురావాలి అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎం.ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ‘మా గురువుగారు కేశవతీర్థగారి వల్లే సినిమాల్లోకి రావడం జరిగింది. ఆయనతో ఎనిమిదేళ్లనుంచి ట్రావెల్ అవుతున్నా. హేమానంద్ సినిమాకు ముందు ఒళ్లుచేసి ఉండేవాడు. కేవలం సినిమాల మీద ఫ్యాషన్‌తో బరువు తగ్గి స్లిమ్‌అయ్యాడు. తన డెడికేషన్ చాలా నచ్చింది. సెట్స్‌లో చక్కగా నటించాడు. సింగిల్ టేక్‌లోనే సీన్ ఓకే అయిందంటే అతను ఎంత చక్కగా నటించాడో అర్ధంచేసుకోవచ్చు. సినిమా అనుకున్న టైమ్‌లోనే పూర్తిచేయగలిగాం. మంచి అవుట్‌పుట్ వచ్చింది. సినిమా పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’అని అన్నారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. ‘వర్షాకాలంలో భయపెట్టే మూవీ ఇది. ట్రైలర్ చాలాబాగుంది. ఇలాంటి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సక్సెస్ అయితే ఎంతోమంది కొత్త ట్యాలెంట్ వస్తుంది’అని అన్నారు.