నా మనసును కదిలించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం కార్యక్రమం మరోసారి కష్టాల్లో వున్నవారిని ఆదుకుంది. ఆదివారం ఫిలిం ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో పలువురు పేదలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, దేవులపల్లి అమర్, వక్కంతం వంశి, అనీల్ రావిపూడి, కోటగిరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న గీతా రోహిణి, చాందిని, శ్రీ సాయిలక్ష్మి, జస్విక్, సూర్యచంద్రరావు, డి.వి.శిరీష, శారద, రమేష్, ఆర్.కె.కుమారిలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ- బయట ఏదైనా జరిగితే సినిమా వాళ్ళు ఏమీ చేయలేదని విమర్శిస్తుంటారు. కానీ సినిమావాళ్ళకు ఏదైనా జరిగితే ఆదుకునేవాళ్ళు ఉంటారని మనం సైతం ద్వారా కాదంబరి కిరణ్ నిరూపిస్తున్నారు. ప్రేమ అభిమానాలతో ఆయన అందించే సహాయం మరువలేనిది. సహాయం చేయడమంటే కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, కుటుంబ సభ్యుడిగా మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి. మనం సైతం ద్వారా జరిగే కార్యక్రమాలు చూసి భావోద్వేగానికి గురయ్యాను. ఈ సంస్థకు ఎంత సహాయం చేస్తాను అనేది చెప్పను కానీ తప్పకుండా ఈ సంస్థలో భాగంగా ఉంటాను అని మాటిస్తున్నాను అని అన్నారు. కాదంబరి కిరణ్ మాట్లాడుతూ- సాటి మనిషికి సహాయం చేయడం ద్వారా సంతృప్తి దొరుకుతుంది. మనం ఆదుకున్నవాళ్ళ కళ్ళల్లో కనిపించే సంతోషాన్ని మించిన సంతృప్తి లేదు. వాళ్ళ ఆశీస్సులను మించిన ఆశీర్వాదం లేదని నమ్ముతాను. మనం సైతం కార్యమ్రానికి ఎందరో పెద్దల అండ లభించడం ఆనందంగా ఉంది. గీత రచయిత రామజోగయ్య శాస్ర్తీ లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ కూడా అన్నీ చూసుకుంటానన్నారు.