సమ్మోహనం సూపర్‌హిట్ గ్యారంటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు, అతిథిరావు హైదరీ జంటగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన సమ్మోహనం చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కొరటాల శివ, వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్, దిల్‌రాజు, ఎస్.వి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ- ఈ సినిమాకు సూపర్‌హిట్ లక్షణాలు కనిపిస్తున్నాయి. సుధీర్ చాలా చక్కగా చేశాడు. ఆయన విషయంలో మేం గర్వంగా ఫీల్ అవుతాం. ఈ సినిమా గురించి ముందే తెలుసు. అలాగే నరేష్ ఈ ఏడాది మంచి పాత్రల్లో నటించి ఆకట్టుకుంటున్నాడు. మోహనకృష్ణ డైరెక్ట్ చేసిన అష్టాచమ్మా నాకు బాగా నచ్చిన చిత్రం. అలాగే జెంటిల్‌మెన్ కూడా చూశాను. తప్పకుండా ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ- మహేష్ ఈ వేడుకలో పాల్గొనడం ఆనందంగా వుంది. దాంతో ఈ సినిమాపై మా నమ్మకం రెట్టింపు అయింది. ఇంత మంచి సినిమా ఇచ్చిన మోహనకృష్ణకు ధన్యవాదాలు అన్నారు. దర్శకుడు మోహనకృష్ణ మాట్లాడుతూ- 2008లో మహేష్ అభిమాని అయిన ఓ చిన్నపాప స్ఫూర్తితో ఆ సినిమా చేశాను. మహేష్ అంటే ఆయన అభిమానులకు పిచ్చి. అదే ఆ సినిమాలో చెప్పాను. మహేష్ ఈ వేడుకకు రావడం మమ్మల్ని ప్రోత్సహించడం ఆనందంగా వుంది. సుధీర్ అద్భుతమైన నటుడు. అలాగే నరేష్ కూడా మంచి పాత్ర చేశాడు. టెక్నీషియన్ల సహకారంతో మంచి సినిమా చేశాం. ఈ నెల 15న విడుదలవుతుంది. తప్పకుండా మీ ఆదరణ ఉంటుందని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ సినిమా విజయం కావాలని కాంక్షించారు.