హను రాఘవపూడితో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ హీరో నాని మరో చిత్రానికి ఓకె చెప్పాడు. 2016లో తనతో కృష్ణగాడి వీరప్రేమగాథలాంటి హిట్ చిత్రాన్ని అందించిన హనుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం హను రాఘవపూడి శర్వానంద్-సాయి పల్లవి జంటగా ‘పడి లేచే మనసు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత ఇదే నిర్మాతలతో నానితో సినిమా చేస్తారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడనున్నాయి.
నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీంతోపాటు బిగ్‌బాస్ సీజన్ 2కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మరో రెండు చిత్రాల్లో కూడా నటించేందుకు ఓకే చెప్పాడు నాని. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఎలాంటి వీర ప్రేమ గాధను చూపిస్తారో చూడాలి!