నా లవ్‌స్టోరీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన ప్రేమకథగా మలిచిన ‘నా లవ్ స్టోరీ’ ఆడియో విడుదల ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ప్రముఖుల చేతుల మీదుగా జరిగింది. ప్రముఖ రచయితలు శివశక్తి దత్త, భువనచంద్రలు ఆడియోని ఆవిష్కరించిన ప్రత్యేక అతిథులు ప్రవీణ్ సత్తారు, అనీల్ రావిపూడి, సి.ఉమామహేశ్వరరావులకు అందజేసారు. అనీల్ రావిపూడి థియేట్రికల్ ట్రైలర్‌ని లాంఛ్ చేయగా, ప్రవీణ్ సత్తారు, సి.ఉమామహేశ్వరరావు, రచయిత భారతీబాబు, ఆదిత్యా మ్యూజిక్ నిరంజన్‌లు సాంగ్స్‌ని విడుదలచేసారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ పాల్గొని తమ సినిమా విశేషాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా శివశక్తిదత్త మాట్లాడుతూ.. ‘దర్శకుడు శివగంగాధర్ నాకు చాలాకాలంగా తెలుసు. శివ తన శక్తినంతా ధారపోసి ఈ సినిమాని రూపొందించాడు. ఈ సినిమాలో పాటలు రాయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకులు ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. భువనచంద్ర మాట్లాడుతూ.. ‘నా లవ్ స్టోరీ’ గురించి మాట్లాడాలంటే నాకు నా లవ్‌స్టోరీ గుర్తుకువస్తుంది. దర్శకుడు కథ చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. రచయితగా కొంత గ్యాప్ వచ్చింది. శివశక్తి దత్తగారి వంటి విద్వత్తుకలిగిన రచయితతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. హీరోహీరోయిన్లు బాగాచేసారు. ప్రేక్షకుల ఆదరణ పొందుతారని ఆశిస్తున్నాను’ అన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.. ‘హీరో బాగున్నాడు. హీరోయిన్ బాగుంది. చూసిన పాటలు బాగున్నాయి. సినిమా కూడా బాగుంటుందని అనుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు. దర్శకుడు శివగంగాధర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు నాలుగు పిల్లర్స్ ఉన్నాయి. అవి హీరో ఫాదర్‌గాచేసిన తోటపల్లి మధు, హీరో మహిధర్, హీరోయిన్ సాక్షిసింగ్ మరియు హీరోయిన్ ఫాదర్‌గా చేసిన శివన్నారాయణ. ఈ నలుగురి మధ్యలో జరిగే కథే ‘నా లవ్ స్టోరీ’. గేటడ్ కమ్యూనిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక అందమైన ప్రేమకథను చెప్పాం. తప్పకుండా మీ మనసుకు హత్తుకునే అంశాలను పొందుపరిచాం. సినిమా పైరసీ ఇండస్ట్రీని నాశనం చేస్తుంది. సినిమా తీయాలంటే భయపడే పరిస్థితికి తెచ్చింది. దయచేసి పైరసీని చేయకండి’ అన్నారు.