ఇప్పటి వరకూ ఇలాంటి పాత్ర చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలనీ ఉందంటున్నారు హీరో సుధీర్‌బాబు. ఎస్‌ఎంఎస్ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన సుధీర్‌బాబు ఆ తరువాత తనకంటూ విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటూ ఎదుగుతున్నాడు. అటు హిందీలో కూడా విలన్‌గా పరిచయం అయిన సుధీర్ తాజాగా ఓ భిన్నమైన ప్రేమకథతో మన ముందుకు వస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సమ్మోహనం. అతిథిరావు హైదరీ హీరోయిన్. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 15న విడుదల అవుతున్న సందర్భంగా సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు..
అలా కుదిరింది..
మోహన్ ఒక రోజు ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ ఉంది, వినండి అన్నారు. నా తొలి సినిమా ఎస్‌ఎంఎస్ విడుదలకు ఓ వారం ముందు ఇంద్రగంటితో ఓ సినిమా చేద్దామనుకున్నా. ఓ ప్రొడక్షన్ హౌస్‌తో సైన్ కూడా అయింది. కానీ టేకాఫ్ కాలేదు. ఆ సినిమాకు అవసరాల శ్రీనివాస్ సబ్జెక్ట్ ఇచ్చేట్టు, ఇంద్రగంటి డైరెక్ట్ చేసేట్టు అనుకున్నారు. ఆ సినిమానే తర్వాత ‘ఊహలు గుసగుసలాడే’ పేరుతో తీశారు. కాకపోతే నాకు చెప్పినపుడు కాస్త వేరుగా ఉండేది. ఈ సినిమా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. చాలా ఇంటరెస్టింగ్‌గా, ఛాలెంజింగ్‌గా అనిపించింది. లవ్‌స్టోరీస్ నేను కొన్ని చేసినా సరే.. ఇది రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటుంది. సినిమాటిక్‌గా ఉండదు.
నా పాత్ర గురించి..
ఇందులో నా పేరు విజయ్. నేను చిల్డ్రన్ బుక్స్ ఇల్‌స్ట్రేటర్‌గా కనిపిస్తాను. ఐడలిస్టిక్ పర్సన్‌ని. సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా స్టార్స్‌మీద కొన్ని అభిప్రాయాలుంటాయి. అతిథిరావు ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా నటించింది. మేకప్‌తో, మేకప్ లేకుండా స్టార్ లైఫ్ ఎలా వుంటుందో తెలుసుకుంటాను నేను. మేమిద్దరం ఎలా కనెక్ట్ అయ్యామనేదే ఈ సినిమా. ఓ కామన్ ఆడియన్‌కి ఉన్న డౌట్స్‌ని ఆన్‌స్క్రీన్‌మీద డిస్‌కస్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇంద్రగంటితో పనిచేయడం గొప్ప అనుభూతి. ఆయన ఇప్పటిదాకా ఇలాంటి ఇంటెన్స్ లవ్‌స్టోరీ చేయలేదు. అంతకుముందు ఆ తర్వాత ఉన్నా... అది వేరు. ఇది ఆయన తెరకెక్కించిన ప్రాపర్ లవ్‌స్టోరీ. ఈ టైప్ ఆఫ్‌గా డీల్ చేసిన సినిమాలు ఇంతకుముందు రాలేదు. ‘ఏ మాయ చేసావె’ కూడా వేరు.
యాక్షన్ ఇమేజ్..
యాక్షన్ ఇమేజ్ ఆల్రెడీ వుంది. కేవలం బాడీ పెట్టుకుని సినిమా చేసినా కుదరదు. ఇందులో ఇల్‌స్ట్రేటర్ గన్నులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. పెన్నులు పట్టుకుంటే చాలు. అలాగని కాన్షియస్‌గా ఏమీ అనుకోలేదండీ. నాకు వచ్చిన స్క్రిప్ట్‌లలో ఇవి నచ్చినవి, అందుకని వీటిని చేశానంతే. మెజర్‌మెంట్స్ లాటివి ఏమీ లేవు కదా. జస్ట్ చేసేశాం. ప్రూవ్ చేసేసుకున్నాం అని అనుకోవడానికి. ప్రేక్షకులు చెప్పాలంతే. ప్రతి సినిమాతోనూ మనస్ఫూర్తిగా ప్రయాణం చేస్తున్నా. నేను నటించిన తర్వాత ఆ సన్నివేశాలను చూసుకుంటే ఇంతకన్నా బెస్ట్‌గా చేయగలమా అని అనిపిస్తుంది. నా రియల్ లైఫ్‌కీ, ఈ కథకీ పోలికలు లేవు. నేను యాక్టర్‌ని కాకముందు ఏమైనా పోలికలున్నాయేమో. నేను చేసే ప్రతి రోల్‌లోనూ నా ఎక్స్‌పీరియన్స్‌ను గుర్తుచేసుకుని చేయాలనుకుంటా. అలా ఏమైనా ఒకటీ రెండు కలిసి ఉండవచ్చు.
ప్రొడక్షన్ హౌస్..
మన చుట్టూ చాలామంది ప్రతిభావంతులున్నారు. కొరియోగ్రాఫర్లు, పాటలు రాసేవాళ్లు, నటీనటులు.. ఎంతో టాలెంట్ ఉండి కూడా ఇక్కడ తిరగలేక వెళ్లిపోయిన వాళ్లున్నారు. నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే బావుంటుందనిపించి చేశా. చాలామంది వచ్చి కలుస్తూనే ఉన్నారు. ఈ బ్యానర్‌లో మంచి సినిమాలు తీయాలి. మంచి కథ ఉంటే ఇంద్రగంటి వారి దర్శకత్వంలో మహేశ్ హీరోగా మా బ్యానర్‌లో సినిమా చేస్తే చాలా బావుంటుంది.
అదితిరావుతో...
చాలా చక్కగా చేసాము. తను కూడా ఇంతకుముందు సినిమాలు చేస్తుంది. మేమిద్దరం సన్నివేశాలను గురించి మాట్లాడుకునేవాళ్లం. సెట్స్‌కి రావడానికి ముందే ప్రిపేర్ అయి వచ్చేవాళ్లం. బాలీవుడ్ నుంచి ఎవరైనా వస్తే షూట్‌లో ప్రొనౌన్స్ కూడా సరిగా చేయలేరు. కానీ అదితి చాలా స్పష్టంగా నేర్చుకుని వచ్చేసేది. తను తొలి సినిమాకే డబ్బింగ్ కూడా చెప్పింది. స్కిల్స్ వైజ్ తను బెస్ట్ కోస్టార్. అలాగే మా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చూట్టానికి తెల్లగా ఉంటారు.. అంతే స్వచ్ఛంగానూ వుంటారు. భవిష్యత్తులోనూ ఆయనతో సినిమా చేయాలని వుంది. ఆయన ప్రొడక్షన్ వైజ్, ప్రమోషన్ వైజ్ చాలా బాగా చేస్తున్నారు.
తదుపరి చిత్రాలు..
పుల్లెల గోపీచంద్ బయోపిక్ సెప్టెంబర్ నుంచి వుంటుంది. చాలా ఛాలెంజింగ్ స్క్రిప్ట్. ప్రవీణ్ సత్తార్‌గారి దర్శకత్వంలో చేస్తున్నా. బయోపిక్ అనగానే బాడీ లాంగ్వేజ్ పట్టేసి చేసేస్తారు. అలా కాకుండా ఆ వ్యక్తి మనును కూడా పట్టుకోగలగాలి. నేను కూడా గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నా. ఈ సినిమా కోసం ప్రాక్టీస్ కూడా చేస్తున్నా. దాంతోపాటు నా సంస్థలోనే ఓ సినిమా ఉంది. అది లవ్‌స్టోరీ. 70 పర్సెంట్ సిద్ధమైంది. ఆర్.ఎస్.నాయుడు అని కొత్తతను దర్శకత్వం చేస్తాడు. దాంతోపాటు వీరభోగ వసంతరాయలు కూడా దాదాపు పూర్తయింది.

-శ్రీ