సస్పెన్స్ థ్రిల్లర్ ఎమ్ 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనాధ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మి వెంకటాద్రి క్రియేషన్స్ పతాకాలపై స్టార్ యాక్టింగ్ స్టూడియో సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ‘ఎమ్6’. జైరామ్ దర్శకుడు. విశ్వనాథ్ తన్నీరు, సురేష్ నిర్మాతలు. ధ్రువ, శ్రావణి, అశ్విని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమైంది.ఈ సందర్భంగా నిర్మాత విశ్వనాధ్ తన్నీరు మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను క్వాలిటీలో రాజీపడకుం డా నిర్మించాం. ఈ చిత్రంలోని ‘ఈ క్షణం..’అనే మెలోడియస్ పాటను అరకు, మంగళూరులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించడం జరిగింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. దర్శకుడు జైరామ్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో సస్పెన్స్‌తోపాటు కామెడీ, యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. టెక్నికల్‌గా మంచి స్టాండర్ట్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందించాం. చక్కని ఫొటోగ్రఫీ, వీనుల విందైన సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయి’ అన్నారు. హీరో ధ్రువ మాట్లాడుతూ ‘ఇది నా తొలి చిత్రం. అన్నివర్గాల ప్రేక్షకులకీ నచ్చుతుందీ చిత్రం. ఓ మంచి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అన్నారు.