22న దమ్ముంటే సొమ్మేరా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతానం, అంచల్‌సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాంబాల దర్శకత్వంలో రూపొందిన ‘దిల్లుడు దుడ్డు’ చిత్రాన్ని ‘శ్రీకృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటరాజ్ ‘దమ్ముంటే సొమ్మేరా’ టైటిల్‌తో అనువదించి తెలుగులో విడుదల చేస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకుని ఈనెల 22న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు మాట్లాడుతూ, ‘సంతానం తమిళ్‌లో హాస్య నటుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన గత సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు హీరోగా చేస్తోన్న సినిమాకావడంతో మంచి అంచనాలున్నాయి. ఈనెల 22న భారీఎత్తున సినిమా రిలీజ్ అవుతుంది. అందరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అని అన్నారు. శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ, ‘తమిళంలో తేండాల్ ఫిలిమ్స్ నిర్మించిన సినిమా ఇది. అక్కడ పెద్ద విజయాన్ని సాధించింది. తెలుగులో దమ్ముంటే సొమ్మేరా టైటిల్‌తో అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నాం. మా బ్యానర్‌లో రిలీజ్ అవుతోన్న తొలి సినిమా ఇది. ఈనెల 22న రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు అంతా తప్పకుండా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అని అన్నారు.ఈ చిత్రానికి సంగీతం: థమన్, సినిమాటోగ్రఫీ: దీపక్‌కుమార్‌పతి, ఎడిటింగ్: గోపీకృష్ణ, బిజినెస్ ఎగ్జిక్యూటివ్: జె.నరసింహారెడ్డి, నిర్మాత: నటరాజ్.

చిత్రం..సంతానం, అంచల్‌సింగ్