రియల్ దండుపాళ్యం ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకంపై నారాయణ భట్ సమర్పించు చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. కన్నడ ఫేమ్స్ రాగిణీ ద్వివేది, మేఘనరాజ్, దీప్తి, ప్రధమప్రసాద్, సంయుక్త హోర్నాడ్‌లు నటించగా.. సి.పుట్టుస్వామి నిర్మాతగా వ్యవహరించారు. మహేష్ దర్శకుడు. ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం విడుదలచేశారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.. కన్నడలో ఇదివరకే వచ్చిన దండుపాళ్యానికి, ఇప్పుడు నా దర్శకత్వంలో వస్తున్న ఈ రియల్ దండుపాళ్యంకు చాలా వ్యత్యాసం ఉంది... ఈ రెండు చిత్ర కథలకు ఏమాత్రం సంబంధం లేదు. 1980లో కర్ణాటకలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది... ఎలా జరిగిందో అలానే సినిమాలో చూపించడం జరిగింది. ఇందులో 5 మంది హీరోయిన్స్, ఇద్దరు హీరోలు నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ్ధర్ నేను కలసి కన్నడలో 9 సినిమాలు చేశాం. అన్నీ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. ఈ చిత్రానికి కూడా తానే ఉండాలనే ఉద్దేశ్యంతో శ్రీ్ధర్‌ను తీసుకోవడం జరిగింది. నిర్మాత పుట్టుస్వామి, చలపతిల సహకారంతోనే ఈ చిత్రం ఇంతవరకు వచ్చింది. వారికి నా కృతజ్ఞతలు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు. నిర్మాత పుట్టుస్వామి మాట్లాడుతూ.. తెలుగులో ఇదివరకే 3 సినిమాలు చేశాను. అన్నీ విజయవంతం సాధించాయి... నా బ్యానర్ నుంచే విడుదల చేశాను మొదటిసారి ఇతర బ్యానర్‌నుంచి రియల్ దండుపాళ్యం చిత్రాన్ని చేస్తున్నా.. ఎవరూ చేయని డిఫరెంట్ కానె్సప్ట్‌తో డైరెక్టర్ వచ్చాడు. సినిమా పూర్తిఅయ్యాక చూస్తే.. నేనే థ్రిల్‌అయ్యా.. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. కన్నడలో పెద్ద హీరోయిన్స్ కూతుర్లే ఈ సినిమాలో నటించిన నలుగురు హీరోయిన్స్. చాలా బాగా నటించారు.. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్టపరంగా ఏర్పడిన చర్యను వారు ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ రియల్ దండుపాళ్యం కానె్సప్ట్. సందేశాత్మక చిత్రం కనుక తెలుగు, కన్నడ భాషల్లో ఈనెల ఆఖరున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ.. మ్యూజికల్ స్పేస్ ఉన్న చిత్రం ఇది. ఔట్‌పుట్ చాలా బాగావచ్చింది. దర్శక నిర్మాతలు నాకు ఫ్రీడమ్, నమ్మకం ఇచ్చారు. సింగర్స్ అద్భుతంగా పాడారు. హిట్ అవుతుందని భావిస్తున్నా అన్నారు.హీరో యువరాజ్, దీప్తి, ప్రధమప్రసాద్, భారతీబాబు, సుమిత్ర, మూర్తి, రఘుబట్, పద్మావసంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాగిణి ద్వివేది, మేఘనరాజ్, దీప్తి, ప్రధమప్రసాద్, సంయుక్త హర్నడ్, యువరాజ్, రఘు బట్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శ్రీ్ధర్.వి.సభ్రం, మాటలు- పాటలు: భారతిబాబు, పివిఎల్‌ఎన్ మూర్తి, నిర్మాత: సి.పుట్టుస్వామి, డైరెక్టర్: మహేష్.
చిత్రం..సుమారంగనాథ్