ఈ మాయ పేరేమిటో.. టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

30ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతోమంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్. ఈయన తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. వి.ఎస్.క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రానికి రాము కొప్పుల దర్శకుడు.
దివ్య విజయ్ నిర్మాత. లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ టీజర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. ఈ సందర్భంగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘టు ఇంట్రడ్యూస్ న్యూ టాలెంట్ ఈజ్ ఆల్వేస్ మై ప్లెజర్. రీసెంట్‌గా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ షూటింగ్ జరిగినప్పుడు రాహుల్‌ని చూశా. అందులో కబడ్డీ ఫైట్ విజయ్ మాస్టర్ చేశారు. అప్పుడు కలిశా. గుడ్‌లుకింగ్ బాయ్ అనుకున్నా. ఈ ఫంక్షన్‌కి పిలవడానికి వచ్చినప్పుడు రెండు పాటలు చూపించారు. అవి చూశాక... గుడ్ లుకింగ్ ప్లస్ గ్రేట్ టాలెంట్. మంచి పేరుతెచ్చుకుంటాడని అనుకున్నా. ఇండస్ట్రీలో పైకి రావడం అంత ఈజీ కాదు. ప్రతి సినిమాలో ఏదో ఒక ఫ్రెష్‌నెస్, హిడెన్ టాలెంట్ చూపించాలి. రాహుల్ కష్టపడి పేరుతెచ్చుకుంటాడని ఆశిస్తున్నా’అన్నారు. నిర్మాత దివ్య మాట్లాడుతూ.. ‘‘కొన్నిరోజుల క్రితం రెండు లుక్స్ విడుదల చేశాం. మొదటిది ఫస్ట్‌లుక్. రెండోది క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లుక్. రెండింటికీ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు టీజర్ విడుదల చేస్తున్నాం. నాన్నగారు అడగగానే ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా నాగచైతన్య యస్ చెప్పారు. ఆయన చాలా బిజీ. రెండు సినిమాలు సైమల్టేనియస్‌గా షూట్ చేస్తున్నారు. అంత బిజీలోనూ మాకోసం వచ్చినందుకు థాంక్స్. రాహుల్‌కి చైతన్య గారంటీ చాలా ఇష్టం. మా సినిమానుంచి మేం విడుదలచేస్తున్న ఫస్ట్ కంటెంట్ ఇదే. చాలా ఎగ్జయిటెడ్‌గా, నెర్వస్‌గా ఉంది’’ అన్నారు. దర్శకుడు రాము మాట్లాడుతూ- ‘‘అందరికీ థాంక్యూ. అక్కినేని నాగచైతన్య గారికి స్పెషల్ థాంక్స్. ‘100% లవ్’కి నేను అప్రెంటీస్‌గా చేశా. అమ్మానాన్నలు పిల్లలమీద చాలా నమ్మకం ఉంచుతారు. అలా నామీద నమ్మకం ఉంచినవాళ్లు ఇద్దరు. ఒకరు మా గురువుగారు సుకుమార్‌గారు. రెండో వ్యక్తి విజయ్ మాస్టర్. ఆ నమ్మకమే నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చి నిలబెట్టింది. అమ్మానాన్నలను ఎలా మర్చిపోమో.. వీళ్ళనూ అలాగే మర్చిపోను.. సినిమా చాలాబాగా వచ్చింది’ అన్నారు.
రాహుల్ విజయ్ మాట్లాడుతూ ‘‘పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ కూడా ప్రేక్షకులకి నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ మాయ పేరేమిటో... ప్రేమే. మరో ప్రేమకథ. ఇద్దరు మనుషులు. వాళ్ళ తాలూకా ఎమోషన్స్, వాళ్ళ బ్యాగ్రౌండ్, వాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసే విధానం.. ఒక మనిషికి ఇంకో మనిషికి సంబంధం ఉండదు. అలాంటి ఇద్దరు మనుషులు ప్రేమలో పడితే... ఆ ప్రేమ ఇంకెంత కొత్తగా ఉంటుందో? మా సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది అన్నారు.