విజేత టీజర్‌పై స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన విజేత సినిమా టీజర్ నిన్న విడుదలై ఆడియన్స్‌నుండి మంచి రెస్పాన్స్ పొందింది. యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉండడమే కాకుండా 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి. టీజర్‌లో కళ్యాణ్‌దేవ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా కనబరిచాడు. విజేత టీజర్ చూస్తుంటే, ఈ చిత్రం తండ్రి, కొడుకుల మధ్య ఉండే అనుబంధాలు, ఆప్యాయతలను గుర్తుచేసే విధంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సబ్జెక్టు కనెక్ట్‌అయ్యే విధంగా కనిపిస్తుంది. ‘మనసుకు నచ్చిన పనిచేసుకుంటూ బ్రతకడం అందరికి సాధ్యంకాదు. లైప్‌లో కొంచెం కాంప్రమైజ్ అయ్యి బ్రతకాలి’. మురళిశర్మ చెప్పిన ఈ డైలాగ్ అందరిని ఆలోచింపచేస్తోంది. రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో కళ్యాణ్‌దేవ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా జూన్ 24న భారీ స్థాయిలో ‘విజేత’ ఆడియో ఫంక్షన్ జె.ఆర్.సి కనె్వంక్షన్‌లో జరగబోతోంది. సినీ పరిశ్రమనుండి ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకాబోతున్నారు. బాహుబలి కెమెరామెన్ కెకె సెంథిల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. జూలై మొదటివారంలో విజేత సినిమాను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కళ్యాణ్‌దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళిశర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా. సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్ శశి, నిర్మాత: రజిని కొర్రపాటి, సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ ప్రెజెంటర్: సాయిశివాని, కెమెరామెన్: కె.కె.సెంథిల్, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సాహిత్యం: రెహమాన్, రామజోగయ్యశాస్ర్తీ, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ, స్టంట్స్: జాషువ, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్.