అతడే పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుల్కర్ సల్మాన్, నేహాశర్మ, ధన్సిక హీరోహీరోయిన్లుగా బెజోరు నంబియార్ దర్శకత్వంలో మలయాళంలో రూపొంది హిట్ అయిన సినిమా ‘సోలో’. ఈ చిత్రాన్ని వెంకటసాయి ప్రియాన్నీ క్రియేషన్స్ పతాకంపై వెంకటేష్ గాజుల తెలుగులో ‘అతడే’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదలయంది. అతిథిగా హాజరైన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి పాటల సీడీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సినిమాలో నాలుగు రకాల విభిన్న కథలు మేళవింపుగా ఉంటాయి. హీరో దుల్కర్ సల్మాన్ అన్ని షేడ్స్‌లోనూ బాగా నటించారు. ప్రొడక్షన్, టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నాయి. సినిమా చూస్తున్నప్పుడు డబ్బింగ్ చిత్రమనే ఫీలింగ్ రాదు. ఇలాంటి మంచి కానె్సప్ట్‌తో కూడిన చిత్రాలను తెలుగులో విడుదల చేస్తున్న వెంకటేష్‌కు మంచి విజయం దక్కాలి’ అని అన్నారు. ‘్భస్కరభట్ల, పూర్ణాచారి మంచి సాహిత్యం అందించారు. గోవింద్ మీనన్, ప్రశాంత్ పిళ్లయ్‌లు అందించిన సంగీతం అందరికీ నచ్చుతుంది. ఎంతో ఇష్టపడి తీసుకున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’అని చిత్ర నిర్మాత వెంకటేష్ చెప్పారు. మాటల రచయిత గౌతమ్ కశ్యప్ మాట్లాడుతూ- ‘డబ్బింగ్ సినిమాలకు మేం ఎప్పుడూ మాటలు రాయలేదు. ఈ చిత్ర కథ సంతృప్తి చెందేలా నచ్చడంతో మాటలు రాశాం’ అని అన్నారు.