సమ్మోహనపరిచారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు, అదితిరావు హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై కృష్ణ ప్రసాద్ నిర్మించిన ‘సమ్మోహనం’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ విజయోత్సవ సభని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధీర్‌బాబు మాట్లాడుతూ- ఈ సినిమా నన్ను సామాన్య ప్రేక్షకులకు దగ్గర చేసింది. ప్రేమకథా చిత్రం తరువాత చాలా చిత్రాలు చేశాను. కానీ నన్ను అందరూ ఆ చిత్రంతోనే పిలిచేవారు. చాలా రోజులకు సమ్మోహనం హిట్‌తో వాటన్నింటినీ తుడిచేసింది. ఈ సినిమా మహేష్‌కు కూడా బాగా నచ్చింది. ఆయనతోపాటు చాలామంది హీరోలు సపోర్టు చేశారు. ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఇంత మంచి సినిమా ఇచ్చిన మోహన కృష్ణకు థాంక్స్. దర్శకుడు మోహనకృష్ణ మాట్లాడుతూ- ఈ కథపై మేం పెట్టుకున్న నమ్మకం నిజం అయింది. కథను విన్పించినప్పటినుంచీ నిర్మాత కృష్ణప్రసాద్ సపోర్టు చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ కథను ఒప్పుకున్న సుధీర్‌బాబు ఛాలెంజింగ్‌గా సినిమా చేశాడు. అలాగే పి.జి.విందా అద్భుతమైన కెమెరా పనితనం చూపించాడు. ఈ సినిమాతో పనిచేసిన ప్రతి ఒక్కరూ అందించిన సపోర్టుతోనే ఇంత మంచి విజయాన్ని అందుకున్నాం అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- మోహనకృష్ణ మరోసారి మా బ్యానర్‌కు మంచి విజయాన్ని ఇచ్చారు. ఓ మంచి సినిమాను నిర్మించాలన్న సంతృప్తి వుంది. ఇంత సపోర్టు చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ- వివేక్ సాగర్ అందించిన పాటలు మంచి విజయం సాధించాయి. మంచి సినిమా ఇది. అందరికీ అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.