గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు తాజాగా నటిస్తున్న చిత్రం డెహ్రాడూన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెలాఖరువరకూ అక్కడే షూటింగ్ జరపనున్నారు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత ఆయన 26వ చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు ఓకె చెప్పాడు. తాజాగా మహేష్ 27వ చిత్రానికి అప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కనుందట. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఇప్పటివరకూ ఎక్కువ శాతం మెగా హీరోల చిత్రాల్నే నిర్మించేవారు. అడపా దడపా బయటి హీరోలతోకూడా సినిమాలు చేసిన అల్లు అరవింద్, తాజాగా మహేష్‌బాబుతో చర్చలు జరిపినట్టు ఫిలిం వర్గాల్లో వార్తలొస్తున్నాయి. ఈ బ్యానర్‌లో చేసేందుకు మహేష్ కూడా సుముఖంగా వున్నట్టు తెలుస్తోంది. సరైన దర్శకుడు, కథ కుదిరితే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక వివరాలు వెలువడేవరకూ వెయిట్ చేయాల్సిందే.